*రాజకీయ జీవితాన్నిచ్చిన నిజామాబాద్ జిల్లాకు ఎప్పటికీ రుణపడి ఉంటా*
* నిజామాబాద్ అక్టోబర్ 4:(నిఘానేత్రం ప్రతినిధి)* తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి కృతజ్ఞతగా జిల్లాలోని మెడికల్ కాలేజీకి సోనియా గాంధీ పేరు పెట్టాలి
* జిల్లా పార్టీ కార్యాలయ నిర్మాణానికి 5. లక్షల విరాళం ప్రకటించిన మధు యాష్కీ గౌడ్
* టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సన్మాన సభలో దీపా దాస్ మున్షి , మంత్రులు, పార్టీ నేతలతో కలిసి పాల్గొన్న మధుయాష్కీ గౌడ్
నాకు జన్మనిచ్చింది హయత్ నగర్ అయినా.. రాజకీయ జీవితాన్నిచ్చింది నిజామాబాద్ జిల్లా నేనని.. ఈ జిల్లాతో అనుబంధం తన జీవితాంతం ఉంటుందని టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ పేర్కొన్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ నియమితులైన సందర్భంగా నిజామాబాదులో ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపా దాస్ మున్షి , పలువురు మంత్రులు , పార్టీ ముఖ్య నేతలతో కలిసి మధు యాష్కీ గౌడ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ… జాతీయస్థాయిలో ఎదిగేందుకు అవకాశం కల్పించిన నిజామాబాద్ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని పేర్కొన్నారు.
బడుగు, బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీలోనే అవకాశాలు లభిస్తాయని, వి.హనుమంతరావు, డి. శ్రీనివాస్, పొన్నాల లక్ష్మయ్య , తాజాగా మహేష్ కుమార్ గౌడ్ లాంటివాళ్ళు పీసీసీ అధ్యక్షులుగా కావడమే ఇందుకు నిదర్శనం అన్నారు. డి శ్రీనివాస్ తర్వాత మరోసారి నిజామాబాద్ కు అవకాశం రావడం సంతోషకరమన్నారు.
బీఆర్ఎస్, బిజెపి లాంటి పార్టీలలో ఇలా బలహీన వర్గాలకు అవకాశాలు దక్కవని పేర్కొన్నారు.
తాను అమెరికా నుంచి తిరిగి వచ్చినప్పుడు నిజామాబాద్ జిల్లా మాచారెడ్డిపల్లి మండలంలో రైతుల ఆత్మహత్యల నివారణకు షబ్బీర్ అలీ తో కలిసి పని చేశానని, అప్పటినుండి జిల్లాతో అనుబంధం ఏర్పడిందన్నారు.
నేనైనా, మహేష్ కుమార్ గౌడ్ అయినా, ఇతర ఏ నాయకుడి లక్ష్యమైనా.. రాహుల్ గాంధీ ని ప్రధానమంత్రి చేయడమేనని, మరోసారి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడమే లక్ష్యంగా మహేష్ కుమార్ గౌడ్ పార్టీని బలోపేతం చేస్తారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.
తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు కృతజ్ఞతగా నిజామాబాద్ మెడికల్ కాలేజ్ కి సోనియా గాంధీ పేరును పెట్టాలని మధుయాష్కి గౌడ్ ప్రతిపాదించారు. అదేవిధంగా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయిందని.. దాని నిర్మాణం పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు రూ. 5 లక్షలు తాను విరాళంగా అందిస్తున్నట్టు మధుయాష్కి గౌడ్ ప్రకటించారు.
తెలంగాణ రాకముందుకు జనం మనం అని చెప్పిన బీఆర్ఎస్ పార్టీ నేతలు.. అధికారంలోకి వచ్చాక ధనం మనం అనే నినాదంతో దోపిడీ పాలన కొనసాగించారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే ప్రభుత్వం ఏడాది కాలం కూడా ఉండదని అడ్డగోలిగా మాట్లాడారని ని.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటే గడ్డిపోసలు కాదు.. గడ్డపారలుగా నిలబడి పార్టీని కాపాడుకుంటారన్నది తెలుసుకోవాలన్నారు. నిజామాబాద్ జిల్లాతో నా అనుబంధం ఎప్పటికీ ఉంటుందని.. జిల్లాలోనే నాకు ఇల్లు , ఆస్తులు ఆత్మీయులు ఉన్నారని ఆయన పేర్కొన్నారు.