*గత కాంగ్రెస్ ప్రభుత్వంలో పేద ప్రజలకు ఇండ్ల స్థలాలు ఇచ్చేవారు* *రెవెన్యూ భూములు లేకున్నా ప్రైవేటు భూములు కొనుగోలు చేసి గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చేవి* *గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ పేరుతో పేద ప్రజలను మోసం చేసి నిలువ నీడ లేనట్టు చేశారు* *పేదవాడికి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణం కొరకు కొద్దిపాటి డబ్బు సాయం చేసేవారు* *కనుమరుగవుతున్న హౌసింగ్ కార్పొరేషన్* *పేదవారి ఇంటి మరో మత్తులకు హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సాయం అందించే గత కాంగ్రెస్ ప్రభుత్వం* *రాజీవ్ స్వగృహ ద్వారా మధ్యతరగతి వారికి ఎందరికో లాభం చేకూరింది* *డబుల్ బెడ్ రూమ్ పేర్లతో పేద మధ్య తరగతి ప్రజలను గత ప్రభుత్వ మోసం చేసింది* *హౌసింగ్ కార్పొరేషన్ ను పూర్వ వైభవం తీసుకొచ్చి పేద మధ్య తరగతి ప్రజలను ఆ శాఖ ద్వారా ఆదుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వం పై ఎంతైనా ఉంది*
హైదరాబాద్ అక్టోబర్ 6:(నిఘానేత్రం ప్రతినిధి) గతంలో ఎన్నో పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాలంలో ఇందిరమ్మ పేరుపై రాజీవ్ గాంధీ పేరు పై ఎన్నో పథకాలను తీసుకొచ్చి నిలువ నీడలేని పేద ప్రజలకు ఎక్కడో ఒక దగ్గర ప్రభుత్వ రెవెన్యూ భూమిని చూసి పేద ప్రజలకు ఇంటి నిర్మాణం కొరకు 100 గజాల స్థలం ఇచ్చేది. స్థలంతో పాటు కొద్ది కొద్దిపాటి ఆర్థిక సహాయం ఇంటి నిర్మాణం కొరకు చేసేవారు. కూలీలకు రిక్షా కార్మికులకు దడువాయి యూనియన్ కార్మికులకు చాట కార్మికులకు బీడీ కార్మికులకు భవన నిర్మాణ కార్మికులకు ఇలా అట్టడుగున ఉన్న పేద ప్రజలకు ప్రభుత్వ భూమి ఇచ్చి ఇంటి నిర్మాణ సహాయం చేసే గత కాంగ్రెస్ ప్రభుత్వాలు. మధ్యతరగతి వ్యక్తులకు కూడా లాభం చేకూరే విధంగా హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా ఇంటి నిర్మాణాలు చేపట్టి రాజీవ్ స్వగృహ పేరుతో ఇచ్చేవారు. గతంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత హౌసింగ్ కార్పొరేషన్ ను పూర్తిగా విస్మరించి ఆ శాఖ కనుమరుగయ్యే విధంగా ప్రవర్తించారు. హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా వచ్చే ఆదాయాన్ని తీసుకుంటూ హౌసింగ్ కార్పొరేషన్ కొత్త పథకాలను ఇవ్వకుండా వారిని పాత బకాయిలు వసూలు చేయడానికి మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. వారిచ్చే ఆదాయం పైనే గత ప్రభుత్వం దృష్టి పెట్టేది. పేదలకు ఎంతో ఉపయోగపడే హౌసింగ్ కార్పొరేషన్ ను పూర్వ వైభవం తీసుకొచ్చి పేద మధ్యతరగతి ప్రజలకు హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా ఆదుకొని పేద ప్రజలకు ఉండడానికి గూడు కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు