*ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత* *మంత్రి పొంగలేటితో కేంద్ర ప్రభుత్వ గృహ నిర్మాణ, పట్టణాభివృద్ది వ్యవహారాల శాఖ జాయింట్ సెక్రటరీ, శ్రీ కులదీప్ నారాయణ్ భేటీ*
హైదరాబాద్ అక్టోబర్18:(నిఘానేత్రం ప్రతినిధి) రాష్ట్ర ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇళ్ల నిర్మాణంలో రాష్ట్రానికి వీలైనంతవరకు సహాయాన్ని అందించాలని రెవెన్యూ, హౌసింగ్ , సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర ప్రభుత్వ గృహ నిర్మాణ, పట్టణాభివృద్ది వ్యవహారాల శాఖ జాయింట్ సెక్రటరీ, శ్రీ కులదీప్ నారాయణ్ శుక్రవారం నాడు సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రిగారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గడచిన పది సంవత్సరాలలో పేదల ఇళ్ళ నిర్మాణాలను గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ,ఎంతో మంది నిరుపేదలు ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారని ,వారందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఈ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనల ప్రకారమే కేంద్ర ప్రభుత్వ ఆలోచనలు ఉన్నాయి కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వప్రాధ్యాన్నతలను గుర్తించి అవసరం మేరకు రాష్ట్రానికి ఇళ్లను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో హౌసింగ్ కార్యదర్శి జ్యోతి బుద్ధ ప్రకాష్, ప్రత్యేక కార్యదర్శి వి.పి. గౌతమ్ పాల్గొన్నారు