Politics

*ఇందిర‌మ్మ ఇళ్ల ల‌బ్దిదారుల ఎంపిక‌కు ప్ర‌త్యేక యాప్‌* *రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి*

హైదరాబాద్ అక్టోబర్ 26:(నిఘానేత్రం ప్రతినిధి)రాష్ట్రంలో ఇందిర‌మ్మ ఇళ్ల ల‌బ్దిదారుల ఎంపికకు ప్ర‌త్యేక యాప్ ను రూపొందించామ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి వెల్ల‌డించారు. ల‌బ్దిదారుల ఎంపిక పార‌ద‌ర్శ‌కంగా ఉంటుంద‌ని , రాజ‌కీయ పార్టీలు, ప్రాంతాలు అనే బేధం లేకుండా అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికి ఇందిర‌మ్మ ఇండ్లు ఇస్తామ‌ని తెలిపారు. ల‌బ్దిదారుల ఎంపిక కోసం రూపొందించిన యాప్‌ను శ‌నివారం స‌చివాలయంలోని త‌న కార్యాల‌యంలో మంత్రిగారు ప‌రిశీలించారు. ఈ యాప్‌లో ఒక‌టి రెండు మార్పు చేర్పుల‌ను మంత్రి గారు సూచించారు. మంత్రిగారి సూచ‌న‌ల ప్ర‌కారం యాప్‌లో కొన్ని మార్పులు చేసి వ‌చ్చే వారంలో యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈసంద‌ర్భంగా మంత్రిగారు మాట్లాడుతూ కొద్దిరోజుల్లోనే రాష్ట్రంలో ఇందిర‌మ్మ ఇండ్ల ప‌ధ‌కాన్ని ప్రారంభిస్తామ‌ని, ఇందుకు కావ‌ల‌సిన ఏర్పాట్లు తుది ద‌శ‌కు చేరుకున్నాయ‌ని వెల్ల‌డించారు. గ్రామీణ ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను దృష్టిలో పెట్టుకొని యాప్‌లో తెలుగు వెర్ష‌న్ ఉండేలా చూడాల‌ని సూచించారు. లబ్దిదారుల ఎంపిక నుంచి ఇందిరమ్మ ఇండ్లు పూర్త‌య్యేవ‌ర‌కు సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని వీలైనంత‌వ‌ర‌కు వాడుకోవాల‌ని సూచించారు. ఇల్లు లేని ప్రతి పేదవానికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమ‌ని, దీనిని దృష్టిలో పెట్టుకొని అధికార యంత్రాంగం ప‌నిచేయాల‌న్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button