Politics

*దీపావళి ఒక రోజు రెండు రోజులు ముందు తనిఖీలు* *మేము వస్తాము మీరు ఈ పరికారాలు ఉంచండి తనిఖీ చేసినట్టు మీడియాకు చూపిస్తాము అని ముందే వాళ్లకు చెప్పి కుమ్మక్క అవుతున్న అగ్నిమాపక శాఖ* *హైకోర్టు స్టే ఉందని చూపించి నగర నడిబొడ్డున టపాసుల వ్యాపారం* *చిన్న నిర్లక్ష్యం పెద్ద విధ్వంసం ఆదమరిస్తే కిసాన్ గంజ్ ప్రాంతం మొత్తం నాశనమే* *కోట్లలో టపాసుల వ్యాపారం బిల్లు ఉండదు జీఎస్టీ ఉండదు అంతా జీరో లోనే వ్యాపారం* *లంచాల మత్తులో జిల్లా యంత్రాంగం* *అధికారులను బోల్తా కొట్టిస్తున్న అగ్నిమాపక శాఖ* *చూడడానికి చిన్న శాఖ అధికారాలు మాత్రం అధికం* *భారీ నిర్మాణాలు షాపింగ్ మాల్ సినిమా ఆల్ మల్టీప్లెక్స్ అపార్ట్మెంట్స్ ఇలాంటి భారీ నిర్మాణాలకు అగ్నిమాపక శాఖ అనుమతులు కీలకం* *ఎవరి కంటపడకుండా గుట్టుగా దండుకుంటున్న అగ్నిమాపక శాఖ*

నిజామాబాద్ అక్టోబర్ 29:(నిఘానేత్రం ప్రతినిధి) నిజామాబాద్ నగర నడిబొడ్డున కిసాన్ గంజ్ ప్రాంతంలో భారీ మొత్తంలో టపాసుల వ్యాపారం. చట్టానికి వ్యతిరేకంగా కోర్టు ద్వారా స్టే ఉందని అధికారులను సాకుగా చూపించి నగర నడిబొడ్డున ధరజాగా విధ్వంసకర టపాసుల వ్యాపారం నడిపిస్తున్నారు. నగర నడిబొడ్డున టపాసుల వ్యాపారం చట్ట వ్యతిరేకమని జిల్లా అధికారులకు అందరికీ తెలుసు. అయినా బహిరంగంగా దర్జాగా బిల్లు లేకుండా జిఎస్టి లేకుండా కోట్లలో జీరో వ్యాపారం. నాణ్యతలేని నాసిరకం టపాసులను వినియోగదారులకు విక్రయించి వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడుతున్న వ్యాపారస్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవలసిన జిల్లా యంత్రాంగం లంచాల మత్తులో మునిగి తేలుతుంది. అందరికీ ముడుపులు మేము ఇచ్చుకుంటాము మీరు మాత్రం మా జోలికి రాకండి అని అధికారులను కలిసి వారికి కావలసింది సమకూర్చి వస్తారని సమాచారం. అగ్నిమాపక శాఖ టపాసుల వ్యాపారస్తులను వారం పది రోజుల ముందు పిలిచి మీరు అనుమతులు తీసుకోవాలి లేకుంటే మీపై చర్యలు తీసుకుంటామని చెప్పినట్టే చెప్పి వాళ్లకు ఎల అధికారుల కనులను కప్పి దర్జాగా వ్యాపారం చేసుకోవాలో వాళ్లకు సలహాలు ఇచ్చి మరీ పంపిస్తారని విశ్వనీయ సమాచారం. రెండు రోజుల ముందు మీ దగ్గరికి వచ్చి తనిఖీ చేస్తాము. మీరు ఈ పరికరాలు అక్కడ ఉంచండి మేము వచ్చే సమయంలో పాత్రికేయులు కూడా వస్తారు వారి ముంగట మేము మీ దగ్గరికి వచ్చి తనిఖీ చేసినట్టు నటిస్తాము. తదుపరి మేము వెళ్లిపోతాము తమరు దర్జాగా వ్యాపారము చేసుకోండి మాకు కావాల్సింది ఇచ్చుకోండి అని లోపాయికారి ఒప్పందాలు చేసుకొని వారిని పంపి వేస్తారని ప్రజల అభిప్రాయం. వారు ఇచ్చిన సలహా ప్రకారమే అక్కడికి వెళ్లి తనిఖీ చేసినట్టు మీడియా కెమెరాలకు ఫోజులు ఇచ్చి తిరిగి వచ్చి ఆ సమస్యను మర్చిపోతారు. రెండు రోజులు గడిస్తే పండుగ అయిపోతుంది ఆ విషయాన్ని ప్రజలందరూ మర్చిపోతారు. ఈ రకంగా అగ్నిమాపక శాఖ ప్రతి సంవత్సరం ఇలాగే ప్రవర్తిస్తుంది. వాళ్ల దగ్గర ఉన్నది. అసలు హైకోర్టు స్టేనో నకిలీ స్టే నో తెలియదు. ఒకవేళ ఆ స్టేను హైకోర్టు ఏ సంవత్సరంలో జారీ చేసింది ఎన్ని సంవత్సరాలు అనుమతి ఇచ్చింది తెలుసుకొని ఆ స్టేను ఎత్తివేయడానికి అధికారులు ప్రయత్నం చేయాలి. కానీ అలాంటి ప్రయత్నాలు జిల్లా యంత్రాంగం కానీ అగ్నిమాపక శాఖ కానీ ఇంతవరకు చేసినట్టు ఎక్కడ సమాచారం కనిపించట్లేదు పత్రిక ముఖంగా కూడా అట్టి విషయాలను బహిర్గతం జిల్లా యంత్రాంగం చేయట్లేదు. దర్జాగా అక్రమ మందు గుండు సామాగ్రి టపాసుల వ్యాపారం కోట్లలో జరుగుతున్న ఏమీ తెలియనట్టు లంచాల మత్తులో నిద్రిస్తున్న జిల్లా యంత్రాంగం మేలుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button