Politics
*మీడియా అకాడమీ చైర్మన్ ను* *కలిసిన సమాచార శాఖ* *కమిషనర్*
హైదరాబాద్ అక్టోబర్ 30: (నిఘానేత్రం ప్రతినిధి) తెలంగాణ రాష్ట్ర సమాచార మరియు పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన ఎస్.హరీష్ బుధవారం నాడు మీడియా అకాడమీ ఛైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి గారిని బి.ఆర్.కె భవన్ లోని ఆయన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా కొత్త కమిషనర్ కు చైర్మన్ శుభాకాంక్షలు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమ చర్యలపై వారు చర్చించారు.