*మాదకద్రవ్యాలను అరికట్టండి*
నిజామాబాద్ అక్టోబర్ 30:(నిఘానేత్రం ప్రతినిధి)జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించిన మాదకద్రవ్యాల నిరోధం పై ముద్రించిన పోస్టర్లను జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిని శ్రీమతి డాక్టర్ బి రాజశ్రీ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు శ్రీ అంకిత్ చేతుల మీదుగా ఆవిష్కరించినట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ శ్రీ అంకిత్ మాట్లాడుతూ డ్రగ్స్, మాదకద్రవ్యాలు , కల్తీ కల్లు, అన్ని రకాల నార్కోటిక్స్ పై జిల్లా వ్యాప్తంగా ప్రజల్లో, పాఠశాలల్లో ,కళాశాలలో, విస్తృతంగా అవగాహన కల్పిస్తూ మాధక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను వివరించాలని జిల్లాను మాదక ద్రవ్య రహిత జిల్లాగా మార్చడానికి సంబంధిత శాఖలైన పోలీసు, విద్యాశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్ శాఖల న్నింటిని సమన్వయ పరిచే బాధ్యత వైద్యశాఖ తీసుకోవాలని తెలియజేశారు. రోజురోజుకు మాదక ద్రవ్యాలకు, డ్రగ్స్ కు బానిసలు అవుతున్న యువత జీవితాల్లో మార్పు తీసుకురావాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ మాట్లాడుతూ అదనపు కలెక్టర్ సూచనలకు అనుగుణంగా జిల్లా వ్యాప్తంగా ప్రజల్లో పాఠశాలను, కళాశాలలో విస్తృతంగా అవగాహన కల్పిస్తామని తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో అసంక్రమిక వ్యాధుల మానసిక వ్యాధుల నియంత్రణ ప్రోగ్రాం అధికారులు వినీత్ రెడ్డి, రవితేజ, జిల్లా ఆరోగ్య విద్యా బోధకులు ఘన్పూర్ వెంకటేశ్వర్లు , స్వామి సులోచన, ఎన్ సి డి కోఆర్డినేటర్ వెంకటేష్, హెచ్ ఈ ఓ నాగరాజు పాల్గొన్నారు.