Politics

*ఏకలవ్య గురుకులంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం* *12 వరకు చివరి గడువు*

నిజామాబాద్ నవంబర్ 3(నిఘానేత్రం ప్రతినిధి) నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి ఏకలవ్య గురుకులంలో పని చేయుటకు ఔట్ సోర్సింగ్ పద్ధతిన క్యాటరింగ్ అసిస్టెంట్ (01), మెస్ హెల్పర్ (02), శానిటేషన్ (01)(ఉమెన్), ఎలక్ట్రిషియన్ కమ్ ప్లంబర్ (01) పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఒక ప్రకటనలో తెలిపారు. కేటరింగ్ విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులన్నారు. మెస్ హెల్పర్, శానిటేషన్ కోసం 10 వ తరగతి, ఎలక్ట్రిషియన్ కమ్ ప్లంబర్ పోస్టుకు 10 వ తరగతితోపాటు ఐటిఐ, పాలిటెక్నిక్ పూర్తి చేసిన వారు అర్హులని, దరఖాస్తులను ఈ నెల 12 లోపు ఇందల్వాయిలోని ఏకలవ్య గురుకులంలో సమర్పించాలని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో పదవ తరగతి పూర్తి చేసిన బోనాఫైడ్ గల అభ్యర్థులు మాత్రమే అర్హులన్నారు. పూర్తి మెరిట్ ఆధారంగా నియామకాలు చేస్తామన్నారు. ఇవి పూర్తి తాత్కాలిక పోస్టులని, రెగ్యులర్ ఉద్యోగుల నియామకం కొరకు ఇది వరకే నోటిఫికేషన్ విడుదలైందన వీరి తొలగింపు ఎప్పుడైనా జరగవచ్చని తెలిపారు.

దరఖాస్తు సమర్పణ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుందని,

పూర్తి వివరాలకు ఇందల్వాయి ప్రిన్సిపల్ నెంబర్ 83979 47334 సంప్రదించాలని తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button