*ప్రజల ఓట్లతో మేయర్ పదవి పొంది ఆ ప్రజల భూములను ఆక్రమించి తప్పుడు పనులు చేస్తున్న మేయర్ భర్త ?* *తప్పుడు పనులు చేస్తున్న భర్తను కాపాడుకుంటూ వస్తున్న మేయర్ తన పదవికి రాజీనామా చేయాలని ప్రజల డిమాండ్?* *టిఆర్ఎస్ హయాంలో అక్రమ మొరం వ్యాపారం చేసి కోట్లు గడించిన మేయర్ భర్త దండు చంద్రశేఖర్ ?* *మామూలు కంట్రోల్ షాప్ నడిపే వ్యక్తి టిఆర్ఎస్ ఐయామ్ లో పేదల ప్లాట్లను అక్రమంగా ఆక్రమించి అమ్ముకున్న డబ్బులతో మేయర్ పదవిని పొందిన దండు చంద్రశేఖర్*? *మేయర్ భర్త దండు చంద్రశేఖర్ పై గతంలో ఫిర్యాదులు వచ్చిన చర్యలు మాత్రం శూన్యం* *నా ఫ్లాట్ ఆక్రమించుకొని రెండు లక్షలు ఇవ్వవలసిందిగా గోపాల్ ద్వారా బెదిరించడంతోనే అతనిపై దాడి చేశానని దాడి చేసిన వ్యక్తి వీడియో విడుదల చేయడం సంచలనం* *దండు చంద్రశేఖర్ పై నేను దాడి చేశాను అతను బతుకుతాడో చనిపోతాడో తెలియదు అతనిని నేను చంపకపోతే అతను నన్ను చంపేవాడు అందుకే ఈ దాడి చేశాను అని దాడి చేసిన వ్యక్తి వీడియో విడుదల చేయడం జరిగింది*
నిజామాబాద్ నవంబర్18:(నిఘానేత్రం ప్రతినిధి)
మేయర్ భర్త బిఆర్ఎస్ నాయకులు దండు చంద్రశేఖర్ పై సోమవారం సాయంత్రం దాడి జరిగింది అసలు ఈ దాడికి కారణం అతను చేస్తున్న భూ ఆక్రమణ బాధితులు ఎందరో తన పలుకు బడికి తన రౌడీయిజానికి భయపడి ఎందరో స్థలాలు కూలిపోయారు. నాగారం ప్లాట్ల ఆక్రమణ చేసినట్లు అతనిపై గతంలో ఎన్నో ఫిర్యాదులు వచ్చిన. చర్యలు మాత్రం శూన్యం టిఆర్ఎస్ హయాంలో అతను చేసిన అక్రమ మొరం వ్యాపారం ద్వారా కోట్లు గడించి ఆ డబ్బుతోనే మేయర్ పదవిని పొందినట్టు గతంలోనే ఈ వార్త చెక్కర్లు కొట్టాయి. ఒక మామూలు కంట్రోల్ షాప్ నడుపుకునే వ్యక్తి టిఆర్ఎస్ హయాంలో అక్రమాలకు పాల్పడి కోట్ల రూపాయలు సంపాదించి ఎందరో రౌడీ మూకలను తయారు చేసి తన సామ్రాజ్యాన్ని విస్తరించుకొని ఒక భూమాఫియా గా ఒక అక్రమ మొరం వ్యాపారము నడిపి ఇంతటి స్థాయికి ఎదిగినప్పటికీ. పేదవారి భూ ఆక్రమణలు ఆపకపోవడంతో తన భూమి ఆక్రమించాడని తన భూమి తనకి ఇవ్వాలని ఎన్నో పర్యాయాలు అతని వేడుకున్న వినకుండా రెండు లక్షల రూపాయలు గోపాల్ అనే తన అనుచరుడి ద్వారా డిమాండ్ చేశాడని ఇవ్వకపోతే తన ప్లాట్ ఇవ్వనని ఎదిరిస్తే చంపేస్తానని బెదిరించాడని అందుకే అతనిపై దాడి చేశానని ఒక వీడియో విడుదల చేయడం జరిగింది. అతనిని నేను చంపడం జరిగింది అతను చనిపోయాడో లేదో నాకు తెలియదు అతనిపై నేను దాడి చేయకపోతే అతను నన్ను చంపేస్తాడని నా భూమిని కూడా నాకు ఇవ్వడని ఆవేశంతో అతనిపై నేను దాడి చేశానని ఆటో డ్రైవర్ షేక్ రసూల్ ఒక వీడియో విడుదల చేసి తన దాడిని సమర్థించుకున్నాడు. గతంలో ఒక ఉన్నత హోదాలో లేనప్పుడు ఎవరైనా చిల్ల పనులు చేసిన ఒక హోదాలో వచ్చిన తర్వాత హుందాగా ఉండి ప్రజలకు సేవ చేయవలసిన వ్యక్తి అక్రమాలకు పాల్పడుతుంటే అతని ఆగడాలను అదుపులో పెట్టలేకపోయారు. అతని భార్య మేయర్ పదవి లో ఉండడం వలన అతను ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది అని ప్రజల ఆరోపణ ఒక ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి ప్రజలకు న్యాయం చేయాలి ప్రజల శ్రేయస్సు కోరుకోవాలి కానీ ప్రజలను పీడించి ప్రజలు ఇచ్చిన ఆ పదవిలో కొనసాగకూడదని వెంటనే ఆ పదవిని రాజీనామా చేయాలని ఒకవేళ రాజీనామా చేయకుంటే ఆ పార్టీ నాయకులు పార్టీ నుంచి బహిష్కరించి ఆ పదవి నుంచి తొలగించాలని ప్రజలు కోరుకుంటున్నారు