Politics

*మేయర్ భర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే బిగాల*

నిజామాబాద్ ,నవంబర్19(నిఘానేత్రం ప్రతినిధి)నిజామాబాద్ నగర మేయర్ భర్త దండు శేఖర్ పై సోమవారం జరిగిన దాడి క్షమించరాని నేరమని నేరస్తుడితో పాటు ఈ దాడి వేనుకాల ఎవరి హస్తమున్న వారందరిని బి ఆర్ ఎస్ పార్టీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని నిజామాబాద్ నగర మాజీ శాసనసభ్యులు బిగాల గణేష్ గుప్తా అన్నారు.నిజామాబాద్ నగరంలోని నాగారం ప్రాంతంలో నిన్న నిజామాబాద్ నగర మేయర్ దండు నీతి కిరణ్ భర్త దండు శేఖర్ పై హత్యయత్నం జరిగిన విషయాన్ని తెలుసుకుని నిజామాబాద్ నగర మాజీ శాసనసభ్యులు గణేష్ బిగాల మంగళవారం ప్రూడెన్సీ హాస్పిటల్ కి వచ్చి పరామర్శించారు. అనంతరం అక్కడ మీడియాతో గణేష్ బిగాల మాట్లాడుతూ

నిజామాబాద్ నగరంలో మొదటి మహిళ అయినటువంటి దండు నీతూ కిరణ్ భర్త దండు శేఖర్ సోమవారం హత్యాయత్నం జరిగడాన్నీ తీవ్రంగా ఖండిస్తున్నామని చాలామంది ప్రజలు ఏమనుకుంటున్నారంటే పది సంవత్సరాల పాలనలో తెలంగాణ చాలా అభివృద్ధి జరిగిందని అభివృద్ధి గురించి మాట్లాడుతారు కానీ ఒక విషయం గమనించాలి తెలంగాణ రాష్ట్రంలో అయినా నిజామాబాద్ పట్టణంలో అయినా అభివృద్ధితోపాటు శాంతిభద్రతల విషయంలో మేము మా బి ఆర్ ఎస్ పార్టీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నామో మీరు గమనించాల్సిన అవసరం ఉందని, మొదటి మహిళా అయినటువంటి మేయర్ కుటుంబానికి రక్షణ లేకపోతే మరి పట్టణంలో గాని రాష్ట్రంలో గాని అసలు రక్షణ ఉందా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామన్నారు . సోమవారం దండు శేఖర్ ఆయన డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ కోసం పోతే మరి అక్కడకు ఒక వ్యక్తి వచ్చి దారుణంగా పట్టపగలే ఆయనపై దాడి చేయడం ఈ వ్యవస్థలో ఇలాంటివి తగునా? మరి ప్రభుత్వానికి ఓట్లు వేసి గెలిపించింది ఈ దాడులు చేయడానికి కోసమేనా? అని మేము ప్రశ్నిస్తున్నామన్నారు.. మేయర్ కుటుంబం పై దాడి చేస్తే ప్రజలందరూ భయభ్రాంతులవుతారు అనే దురాలోచన తో చేసినటువంటి ఈ నీచమైన పని.గడిచిన 10 సంవత్సరాలలో ప్రజలు మా బి ఆర్ ఎస్ పార్టీ కు పట్టం కడితే నిజామాబాద్ నగరాన్ని అభివృద్ధితోపాటు శాంతి భద్రతలతో మేము నడిపించిన విషయం కూడా ప్రజలకు తెలుసునని, ఈ దాడి విషయాన్నైతే మేము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.ఈరోజు మేయర్ ఒంటరి కాదు ఎవరైనా మా పార్టీ కార్యకర్తలపై దాడి జరిగితే మా బి ఆర్ ఎస్ పార్టీ ఊరుకోదు. అది కేసీఆర్, కేటీఆర్ తో పాటు యావత్ బి ఆర్ ఎస్ పార్టీ వారికి అన్నివిధాల అండగా ఉంటుందన్నారు.రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి విషయంలో ఈ ప్రభుత్వాన్ని పనిని నడిపించండి అని చెబితే, భౌతిక దాడి, అటెంప్ట్ టూ మర్డర్, మర్డర్లు, రైతుల మీద దాడులు చేయడం ఇవన్నీ ఈ ప్రభుత్వం చేస్తుంది. కానీ మరి ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదని ద్వజమెత్తారు.

ఈరోజు మాత్రం చాలా ఘోరమైనటువంటి పరిస్థితి చావు బ్రతుకుల మధ్య హాస్పిటల్లో ఐ సి యూ లో ఉన్నాడు మేయర్ భర్త దండు శేఖర్ .నిన్న మధ్యాహ్నం ఆయన నాకు ఒక విషయం చెప్పారు, అన్నా మనం అధికారంలో ఉన్నప్పుడు వేరు, మరి ఇప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు దారుణంగా పరిస్థితులు మారినాయి అనే విషయం కూడా మేయర్ నా దృష్టికి తీసుకురావడం జరిగింది. నిన్న మధ్యాహ్నం వరకు మేము కలిసే వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నాము.ఆ తర్వాత నేను మధ్యాహ్నం బయలుదేరి హైదరాబాద్ వెళ్లాను. వెళ్లిన కొద్దిసేపటికి ఈ విషయం తెలిసింది. వెంటనే నేను హుటాహుటిగా ఇక్కడకు రావడం జరిగింధన్నారు. దయచేసి నేను ప్రభుత్వాన్ని,పోలీస్ వ్యవస్థను కోరేది ఒక్కటే ఇక్కడ రాజకీయాలు వద్దు. రాజకీయాలు చేసుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి. దానికి మేము కూడా సిద్ధంగానే ఉన్నాము. ప్రజల కోసం మనం ఏo వెలగబెట్టామో దాని గురించి మాట్లాడుకుందాం కానీ మేము మర్డర్లు చేస్తాం, మేము అటెంప్ట్ మర్డర్లు చేస్తాం, మేము నిజామాబాదు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తాం, అంటూ ఉంటే ఇక్కడ చట్టం ఎవరికి చుట్టం కాదు? కాకూడదు? ఖచ్చితంగా ఈ దాడి వెనుక ఎవరి హస్తము ఉన్నా కూడా వాళ్లందరినీ శిక్షించాల్సిందేనని మేము పోలీసు వారిని కోరుతున్నాము. కచ్చితంగా మేము ధర్నాలకు పిలుపునిస్తాం. అవసరమైతే మేము కోర్టుకైనా పోతాం. పార్టీ పరంగా వారికి అండగా ఉంటాం. మరోసారి ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మరొక్క ముఖ్య విషయం ఏమనగా భూ వివాదాలు ఏమైనా ఉంటే చట్టపరంగా వివాదాలు పరిష్కరించుకోవాలి. కానీ ఒకరినొకరు చంపుకుంటామా? చంపుకోము కదా? దీనిని ఎంకరేజ్ చేయవద్దు అది ఏ పార్టీ నైతేనేమీ ఈరోజు అధికారం ఒకరిది? రేపు మరొకరిది? అధికారం శాశ్వతం కాదు? అధికారం మన చేతిలో ఉంది కదా అని దాడులు చేస్తే శాంతి భద్రతలు ఉండవు. కాబట్టి దయచేసి నేను అన్ని పార్టీలకు పిలుపునిస్తున్నాను. ఈ సంస్కృతి మన నిజామాబాదులో ఉండకూడదు ఇది మంచిది కాదు నిజామాబాద్ లో మాత్రమే కాదు యావత్ తెలంగాణలో ఉండకూడదు ఇది మంచిది కాదు. ఇలాంటి దానిని మనం ఎంకరేజ్ చేయవద్దని నేను అన్ని పొలిటికల్ పార్టీలకు అప్పీలు చేస్తున్నానని అన్నారు.ఆయన వెంట బి ఆర్ ఎస్ పార్టీ నగర అధ్యక్షులు సిర్ప రాజు, అధికార ప్రతినిధి ఠాకూర్ సుజిత్ సింగ్, నూడా మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సత్యపాల్, తదితరులు ఉన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button