*పరిశ్రమల ప్రతినిధులకు సి ఎస్ ఆర్ కింద సహకరించాలని విజ్ఞప్తి*.
రంగారెడ్డి ఉమ్మడి జిల్లా:(నిఘానేత్రం ప్రతినిధి)రంగారెడ్డి జిల్లాలో ఆరోగ్యం మరియు విద్య కోసం CSR కింద సహకరించాలని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ ప్రధాన పరిశ్రమల ప్రతినిధులకు సూచించారు.
బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ CSR కింద సహకారం పై ప్రధాన పరిశ్రమల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆరోగ్యం మరియు విద్య కోసం అన్ని పరిశ్రమలు CSR కింద సహకరించాలని అన్నారు. పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయలు, ఫర్నిచర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు ఆసుపత్రులలో అవసరమైన వసతులు కల్పించాలని తెలిపారు. ఇప్పటికే వివిధ రంగాల్లో CSR కింద సహకారం అందిస్తున్న పారిశ్రామికవేత్తలందరినీ అదనపు కలెక్టర్ అభినందించారు.
ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల అధికారి శ్రీలక్ష్మి, ప్రధాన పరిశ్రమల ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.