*నిజాంసాగర్ నీటిని విడుదల చేసిన మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి*
(నిఘానేత్రం సిటీ బ్యూరో)
నిజామాబాద్ ఉమ్మడి జిల్లా రైతాంగానికి నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి సాగునీటిని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి విడుదల చేశారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో వచ్చిన ఉత్తంకుమార్ రెడ్డి మాజీ స్పీకర్ ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావుతో కలిసి నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద హెడ్ యిస్ గేట్లను ఎత్తి యాసంగి సాగు కోసం నీటిని విడుదల చేశారు ఆశిష్ సాంగ్ ఆన్ లోకల్ ఎమ్మెల్యేలు మంత్రి ఉత్తమ్ కు స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, బాన్సువాడ కాంగ్రెస్ నేత ఏనుగు రవీందర్ రెడ్డి, నీటి పారుదలశాఖ అధికారులు ప్రాజెక్ట్ అధికారులు పాల్గొన్నారు.