*సినిమా వాళ్ళ ఆకర్షణకు లోనవుతున్న రాజకీయ నాయకులు?* *ఆకర్షణకు లోనైనా మాజీ మంత్రులు ఇష్టానుసారంగా టికెట్ రేటు పెంచుకునే వెసులుబాటు కల్పించారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి*? *పెద్ద సినిమాలకు తమకు ఇష్టం వచ్చే విధంగా టికెట్ రేటు పెంచుకునే వెసులుబాటు కల్పించిన ప్రభుత్వం చేసిన పెద్ద తప్పు?* *సినిమా వాళ్లు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి సినిమా తీసిన ప్రజలకు ఏమి సంబంధం* *ఇష్టం వచ్చిన రీతిలో టికెట్ల రేటు పెంచి ప్రజలపై భారం వేసే అధికారం ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారు* *ప్రజలపై భారం లేకుండా ప్రజలకు అనుకూలంగా ఉండే ధోరణిలో ప్రభుత్వాలు పని చేయాలి* *పెద్ద సినిమా చిన్న సినిమా తో ప్రజలకు ఏమి అవసరం సినిమాలో దమ్ముంటే ప్రతి సినిమా ప్రజలు ఆదరిస్తారు* *సినిమా హీరోల డైరెక్టర్ల నిర్మాతల జేబులు నింపడానికే తప్పితే. ఇష్టం వచ్చిన రీతిలో టికెట్ల రేట్లు పెంచడం వలన ప్రజలకు ఏమి ఉపయోగం* *సంధ్య థియేటర్లో జరిగిన సంఘటనకు బాధ్యత రైతంగా ప్రవర్తించిన సినిమా హీరో*
హైదరాబాద్ డిసెంబర్ 31:( నిఘా నేత్రం ప్రతినిధి) సినిమా వాళ్ళ ఆకర్షణకు లోనై గత ప్రభుత్వం నుండి ప్రస్తుత వరకు పెద్ద సినిమాలకు తమ ఇష్టానుసారంగా రేట్లు పెంచుకునే వెసులుబాటును ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. సినిమా వాళ్ళ మోజులో పడి మాజీ మంత్రులు ఎన్నో వెసులుబాటు కల్పించిన విషయం తెలంగాణ వ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళ ఆకర్షణకు లోనైనా రాజకీయ నాయకులు తమను నమ్మి ఓటు వేసి గెలిపించుకున్న ప్రజల నెత్తిన పెద్ద సినిమాలనే నేపంతో అధిక భారం మోపుతూ ప్రజలను మోసం చేస్తున్నారని ప్రజల ఆవేదన. ప్రభుత్వాలు ప్రజల మేలుకోరే విధంగా ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఒకే టికెట్ రేటు పెడితే ప్రజలకు ఉపయోగపడుతుంది. కానీ ప్రజలకు ఉపయోగపడకుండా కొందరు సినిమా హీరోలకు నిర్మాతలకు డైరెక్టర్లకు జేబులు నింపే విధంగా ప్రజల జేబుకు చిల్లు పెడుతున్నారు. ప్రజలపై భారం మోపి ప్రజల రక్తాన్ని జనగాల్లా పీల్చుకు తినే విధంగా ప్రభుత్వాలు ప్రవర్తిస్తున్నాయి. కాయ కష్టం చేసి సేద తీరడానికి ఎప్పుడో ఒకసారి మంచి సినిమా వస్తే సినిమాకి ఫ్యామిలీతో వెళ్లాలనుకుంటే వేల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. సామాన్యుడు సినిమా అనే ఆలోచన లేకుండా పోయింది. అందుకే సినిమా థియేటర్లు కూడా తగ్గిపోయాయి వీటన్నిటి కారణం పెద్ద సినిమా చిన్న సినిమా అనే నేపంతో ఇష్టం వచ్చిన రీతిలో రేట్లు పెంచడమే ఇలా రేట్లు పెంచడం వల్ల కొందరికి మాత్రమే ఉపయోగపడుతుంది మిగతా వారికి మాత్రం ఇలాంటి ఉపయోగం లేదు. పెద్ద హీరో హీరోయిన్లకు కోట్లలో రేమినేషన్ ఇచ్చి సినిమాలు తీస్తున్నారు. వాటి భారాన్ని ప్రజలపై మోపుతున్నారు. ఈ దుర్మార్గాన్ని ఇకనైనా మార్చుకోవాలి. లేదంటే కాలమే సమాధానం చెబుతుంది ప్రజలు వెర్రి వాళ్ళు కాదు ఎప్పుడు ఎలా సమాధానం చెప్పాలో ప్రజలకు బాగా తెలుసు వాళ్ల సమయం వచ్చినప్పుడు వాళ్లు కూడా సమాధానం ఇస్తారనే ఆలోచనతోనే ఉన్నట్టు తెలుస్తుంది. సంధ్యా థియేటర్లో జరిగిన సంఘటనకు కచ్చితంగా పూర్తి బాధ్యత హీరో డైరెక్టర్ నిర్మాత తీసుకొని అన్యాయం జరిగిన వారికి న్యాయం చేస్తూ ఇకనుంచి ఎలాంటి తప్పిదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారిపై ఎంతైనా ఉంది. ఎందుకంటే సినిమాలను హీరోలను హీరోయిన్ చూసి వారిని ఎందరో ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళుతుంటారు. హీరోలను ఆదర్శంగా తీసుకొని వెళుతున్న ప్రజలను మంచి చేయాలని ఉద్దేశంతో మంచి పనులు చేసి ప్రజల మనలను పొందవలసిన అవసరం ఆ హీరోలకు ఎంతైనా ఉందని గమనించాలి. పెద్ద సినిమా చిన్న సినిమా అనే తేడాతో దున్నపోతుల బలుస్తున్న హీరోలకు మాత్రమే లాభం చిన్న సినిమా కార్మికులకు మాత్రం ఎలాంటి ఉపయోగం లేదు. కృష్ణానగర్ లో ఎన్నో ఆశలతో సినిమాలో తన టాలెంటును రుజువు చేసుకొని సినిమాలో రాణించాలని సినిమా పిచ్చిలో పడి ఎందరో జీవితాలు నాశనం చేసుకున్నా వారు కోకొల్లలు కనిపిస్తారు. పెద్ద సినిమాలని పెద్ద రెమినేషన్స్ ఇచ్చి బలిసిన వారిని ఇంకా బలుపు వచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారు. సినిమా కార్మికులకు 200 300 500 రూపాయలకు కూలి ఇచ్చి తీసుకు వెళుతూ ఉంటారు. డైలీ కూలి పని చేసుకునే వాడికైనా 800 రూపాయలు కనీస కూలి ఉంది. కానీ సినిమా కార్మికుడికి మాత్రం ఇంత దారుణమైన పరిస్థితి నెలకొంది. ఒక్కొక్క రోజు అవి కూడా దొరకక ఆకలితో అలసిపోయి సొలసిపోయి జీవితాలను వెల్లదీస్తున్నారు. అలాంటి కార్మికులను మేమున్నామనే ధీమా ధైర్యము ఇవ్వవలసిన పెద్ద హీరోలు పెద్ద డైరెక్టర్లు నిర్మాతలు ముందుకు వచ్చి అలాంటి వారిని ఆదుకోవాల్సిన బాధ్యత వారిపై ఎంతైనా ఉందని ప్రజలు అభిప్రాయ వ్యక్తపరుస్తున్నారు. రెమినేషన్ లో నుండి 10% అయినా ఇలాంటి కార్మికులకు ఆదుకోవడానికి ఏదైనా కార్యక్రమం చేపట్టి వారికి మేమున్నామని ధైర్యం కల్పించవలసిన అవసరం ఆ హీరోలకు ఎంతైనా ఉందని ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు