*నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్* *నేడు పర్చువల్ గా ప్రారంభించనున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్* *నేడు నిజామాబాదులో నిఖిల్ సాయి లో రైతులతో సమావేశం* *హామీని నిలబెట్టుకున్న ఎంపీ ధర్మపురి అరవింద్ అరవింద్* *పసుపు బోర్డు చైర్మన్ గా పల్లె గంగారెడ్డి నియామకం*
నిజామాబాద్ జనవరి 14(నిఘానేత్రంప్రతినిధి)
జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్రం అంగీకరించింది.ఈ మేరకు సోమవారం ప్రధానమంత్రి నరేంద్రమోడి, బొగ్గుగనుల శాఖ మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డితో సమావేశం హైదరాబాద్ కేంద్రంలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నిజామాబాద్ జిల్లాలోనే పసుపు బోర్డు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పసుపు బోర్డు కేంద్రంగానే రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన అరవింద్ కు బోర్డు ఏర్పాటు మంచి పేరు తీసుకురానుంది. పసుపు బోర్డు చైర్మన్ గా పల్లె గంగారెడ్డి నియామకంతో నిజామాబాద్ జిల్లా ప్రజలకు మంచి రోజులు రాబోతున్నాయి.ఈ పసుపు బోర్డు విషయంలో మంగళవారం నిజామాబాద్ నగరంలోని నిఖిల్ సాయి హోటల్ లో రైతులతో ఉదయం 11 గంటలకు సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి పలువురు ఐఎఎస్ అధికారులు, మేధావులు హాజరు కానున్నారు.