Politics

*సమస్యలు పరిష్కరిస్తారన్న నమ్మకం ఉంటేనే కాంగ్రెస్ కు ఓటెయ్యండి** *కేటీఆర్, హరీష్ రావు జైలుకు వెళ్లకుండా బండి సంజయ్, కిషన్ రెడ్డి కాపాడుతున్నారు* *రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఎలా వస్తాయి* *ఎమ్మెల్సీ ఎన్నికల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి*

నిజామాబాద్ బ్యూరో ఫిబ్రవరి 24., ( నిఘా నేత్రం) సమస్యలు పరిష్కరిస్తారన్న నమ్మకం ఉంటేనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం లో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన టిఆర్ఎస్ బిజెపిలపై విమర్శల వర్షం కురిపించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్, పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తిగా డిపాజిట్ కోల్పోయిందని, ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు కూడా దొరకక పోటికి దూరమైందన్నారు. బిజెపితో చీకటి ఒప్పందం కారణంగానే టిఆర్ఎస్ పార్టీ పోటికి దూరమైందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. గత పది ఏళ్ల కాలంలో కేవలం 56,000 ఉద్యోగాలు భర్తీ చేస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తొమ్మిది మాసాలలోనే 56 వేల ఉద్యోగాలు భర్తీ చేసిందన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు పట్టభద్రుల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ముందుకెళుతుందన్నారు. ఈ ఎన్నికలు ఎంతో కీలకమైన సబ్బండ వర్గాల సమస్యలు పరిష్కారం కాంగ్రెస్తోనే సాధ్యం అవుతుందని మేధావులు ఆలోచించి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఫోన్ టాపింగ్, ఈ కార్ రేస్, గొర్రెల పంపకాల కుంభకోణం కేసులో కేటీఆర్, హరీష్ రావులు జైలుకు వెళ్లకుండా బండి సంజయ్ కిషన్ రెడ్డిలు అడ్డుపడుతున్నారని ఆయన విమర్శించారు. ఫోన్ టైపింగ్ లో కీలకమైన ప్రభాకర్ రావు ను అమెరికా నుండి ఇండియాకు ఎందుకు తప్పించడం లేదని బండి సంజయ్ ని ప్రశ్నించారు. ప్రభాకర్ రావు ను అమెరికా నుండి ఇండియాకు రప్పిస్తే 48 గంటల్లో కేటీఆర్ ను జైలుకు పంపడం ఖాయమన్నారు. గతంలో ఎన్నో ఫిరాయింపులు జరిగాయని, అప్పుడు రాని ఉప ఎన్నికలు ఇప్పుడు ఎందుకు వస్తాయని ఆయన ప్రశ్నించారు. 2014 నుండి 2023 వరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ లో చేర్చుకొని మంత్రి పదవులు ఇచ్చినప్పుడు ఉప ఎన్నికలు ఎందుకు రాలేదని ఆయన అన్నారు. అధికారం కోల్పోయిన కెసిఆర్ ఆరు నెలలు ఫామ్ హౌస్ లో పడుకొని ఇప్పుడు బయటకు వచ్చి ఎన్నికలు వస్తాయని సత్తా చాటుతామని పగటి కలలు కంటున్నారని రేవంత్ రెడ్డి ఆక్షేపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే దమ్ములేని కెసిఆర్ ఉప ఎన్నికల గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. బీ జే పీ పార్టీతో చీకటి ఒప్పందంలో భాగంగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీ ఆర్ఎస్ పార్టీ పోటీ చేయడం లేదని, ఎవరికి ఓటు వేయాలని కూడా స్పష్టత ఇవ్వడం లేదన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో నిరుద్యోగులను ఉద్యోగాలు భర్తీ చేయకుండా అరిగోస పెట్టారని, ఉద్యోగా ల భర్తీకి వేసిన నోటిఫికేషన్ వేసినట్టే వేసి కోర్టు ద్వారా భర్తీ చేయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. నిరుద్యోగులు పదేళ్లపాటు కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరగడానికే సరిపోయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కేవలం 9 మాసాలలోనే 56 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని , రాబోయే రోజుల్లో గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని ముఖ్యమంత్రి అన్నారు. గత ప్రభుత్వాలయంలో ఉద్యోగులకు నెలాఖారులో వేతనాలు వస్తుంటే కాంగ్రెస్ పార్టీ హయంలో ఒకటో తేదీనే జీతాలు వేస్తున్నామన్నారు. కెసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని, కెసిఆర్ చేసిన అప్పులకు ప్రతి నెల 75 వేల కోట్ల రూపాయలు వడ్డీ కింద చెల్లిస్తున్నామని అన్నారు. విశ్రాంత ఉద్యోగులకు రావలసిన 8వే ల కోట్ల రూపాయలను ఏడాదికి 1000 కోట్ల రూపాయల చొప్పున అందిస్తామన్నారు. రావాల్సిన బెనిఫిట్స్ను గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు.కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఒక్క పైసా ఇవ్వని బీ జే పీ పార్టీకి రాష్ట్రంలో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. మూసీ నదిని ప్రక్షాళన చేస్తానంటే నిధులు ఇవ్వకుండా రాష్ట్ర బిజెపి నేతలు అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి విమర్శించారు. బిజెపి పాలిత రాష్ట్రాలైన గుజరాత్, మధ్యప్రదేశ్,రాజస్థాన్ లలో నదుల ప్రక్షాళన జరుగుతుంటే రాష్ట్రంలో మాత్రం మూసీ నదిని ప్రక్షాళన చేయకుండా బీ జే పీ నేతలు అడ్డుకోవడం సమంజసం కాదన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button