
*ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవి షబ్బీర్ అలీ కి ఇవ్వకపోవడంపై ఉద్యమవైపు అడుగులు వేస్తున్న మైనార్టీలు* *మైనార్టీ సీనియర్ నాయకుడు కాంగ్రెస్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీకి మంత్రి పదవి ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఉధృతం చేస్తాం* *షబ్బీర్ అలీ కి మంత్రి పదవి ఇవ్వకపోవడం మైనార్టీలను అవమానపరచడమే* *నిజామాబాద్ జిల్లాకు మంత్రి పదవి ఇవ్వకుండా జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులను జిల్లా ప్రజలను అవమాన పరిచినట్టేనని ప్రజలలో భావన వ్యక్తం అవుతుంది*
నిజామాబాద్ మార్చ్ 10: (నిఘానేత్రం ప్రతినిధి) నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ముఖ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ మైనార్టీ నాయకుడు తన జీవితమే కాంగ్రెస్ పార్టీకి అంకితం చేసిన షబ్బీర్ అలికి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఇవ్వకుండా అవమాన పరిచినందుకు మైనార్టీలు నిజామాబాద్ జిల్లాలో తమ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పార్టీ చేసిన తప్పును సరిదిద్దుకొని షబ్బీర్ అలీకి మంత్రి పదవి ఇచ్చి మైనార్టీలను గౌరవించాలని కోరుకుంటూ. కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు తమ ఆవేదన నిరసన ద్వారా తెలియపరిచారు పార్టీ నాయకులు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి మైనార్టీల మనోభావాలు దెబ్బ తినకుండా చూడవలసిన బాధ్యత ముఖ్యమంత్రి దేనని వారు తెలియపరిచారు. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో ఒక మైనార్టీ మంత్రి లేకపోవడం అన్ని అర్హతలు ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ కి చిన్న పదవి ఇచ్చి అతనిని పక్కన పెట్టి ఒక్క మైనార్టీ మంత్రి పదవి కూడా రాష్ట్ర మంత్రివర్గంలో లేకపోవడం మా మైనార్టీలను కించపరచడమే కాకుండా మా మనోభావాలను దెబ్బ తినే విధంగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వక మా మైనార్టీలను అవమాన పరుస్తున్న కాంగ్రెస్ పార్టీ పెద్దలకు శాంతితో సదృదయంతో తమరికి తెలియపరుస్తున్నాము. ఈ తప్పును సరిచేసి మంత్రి పదవి షబ్బీర్ అలీ కి మైనార్టీ కోటాలో ఇవ్వకపోతే నిజామాబాద్ జిల్లా లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా మైనార్టీలు పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని వారికి శాంతియుతంగా తెలియపరుస్తున్నాము. అని తెలిపారు ఈ తప్పును సరిదిద్దుకోకపోతే త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమానికి మైనార్టీలు సిద్ధమవుతారని తెలియపరిచారు