
Politics
*రాచాలకు వినతి పత్రం ఇచ్చిన ఎఆర్ కానిస్టేబుల్* *తనను పెబ్బేరు ఎస్సై వేదిస్తున్నాడని ఫిర్యాదు*
పెబ్బేరు మార్చ్ 11:(పెబ్బేరు ప్రతినిధి)నేడు పెబ్బేరు మున్సిపాలిటీలో మార్నింగ్ వాక్ చేపట్టిన బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ కి ప్రజల నుండి అనేక వినతులు వచ్చాయి.
ఈ సందర్భంలో ఎఆర్ కానిస్టేబుల్ దాసరి రవికుమార్ తమ సమస్యపై రాచాలకు వినతి పత్రం ఇచ్చారు.
నేను 6 సంవత్సరాలు వనపర్తి జిల్లా కలెక్టరు గన్ మెన్ గా పనిచేశానని, తనపై పెబ్బేరు ఎస్సై హరిప్రసాద్ రెడ్డి అకారణంగా కేసు పెట్టి. జైలుకు పంపి సస్పెండ్ అయ్యేలా చేశారని, సర్వీస్ నుంచి రిమూవ్ చేయిస్తానని బెదిరిస్తున్నాడని, మీరే ఎలాగైనా తనకు న్యాయం చేయాలని కోరారు.