
*కల్లుకు లేదు బిల్లు ప్రజల ప్రాణాలు చెల్లు* *లంచాల మత్తులో ఎక్సైజ్ శాఖ* *మత్తుపదార్థాలు కలుస్తున్నాయని తెలిసి కూడా చూచి చూడనట్టు వివరిస్తున్న సంబంధితఅధికారులు* *నీళ్ల కల్లుతో వ్యాపారం ప్రజల ప్రాణాలతో చెలగాటం*
నిజామాబాద్ ఏప్రిల్ 10:(నిఘానేత్రం ప్రతినిధి) నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లాలలో యదేచ్ఛగా కల్తీకల్లు వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుంది. ఈ మత్తుమందు కలిపిన కృత్రిమ కల్లును తాగి ఎందరో ప్రజలు వ్యాధులకు గురి అవుతున్నారు. రెండు రోజుల క్రితం కల్తీ కల్లు తాగి బాన్సువాడ ప్రాంతంలో ఎందరో రోగాల పాలు అయి ఆసుపత్రిలో చేరారు. ఈ విషయాన్ని అందరూ అధికారులు చూస్తున్న వారిపై చర్యలేమీ లేవు. నామమాత్రంగా దుకాణాలను సీల్ చేసి కల్లు షాంపిళ్లను సేకరించి చేతులు దులుపుకుంటున్నారు తప్పితే ఈ ఘటనకు బాధ్యులైన వారిని ఇంతవరకు అరెస్టు చేయలేదని తెలిసింది. ఇలాంటి అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించుకుంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోకుండా నామమాత్రపు చర్య తీసుకొని చూచి చూడనట్టు వదిలేస్తున్న అధికారులపై ప్రభుత్వం కఠినమైన చర్య తీసుకొని వాళ్లను అరెస్టు చేసి వాళ్ళ లైసెన్సులను రద్దుచేసి కల్తీకల్లు లేకుండా చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు నిజామాబాద్ జిల్లాలో ఉన్న కల్లు చెట్లు ఎన్ని వాటి ద్వారా స్వచ్ఛమైన కల్లు డిపోలకు ఎంత వస్తుంది వారు ఎంత తయారు చేశారు ఎంత విక్రయించారు అనే సమాచారాన్ని ఎక్సైజ్ శాఖ తమ దగ్గర రికార్డుల ద్వారా భద్రపరచుకొని అందులో కల్తీ జరగకుండా చూడవలసిన బాధ్యత ఆ అధికారులపై ఉందని ప్రజల ఆవేదన. ఈ కల్తీ కళ్ళు తాగడం వల్ల నరాలు పని చేయక ఎలాంటి పని చేయలేని స్థితిలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఊరు విడిచి నాలుగు రోజులు వేరే రాష్ట్రానికి వెళ్లి పని చేయాలనుకుంటే ఐదో రోజు వాళ్లకు ఆ మత్తు దొరకక పిచ్చివాళ్లై తిరిగి పనిని వదిలేసి దారుణమైన స్థితిలో వాళ్ల ఊరికి వచ్చి ఒక్క గిలాస కళ్ళు తాగించిన తర్వాత వాళ్లు మామూలు స్థాయికి వస్తున్నారు. వేరే రాష్ట్రాలకు వెళ్లిన తర్వాత మతిస్థిమితం కోల్పోయి పిచ్చి పిచ్చి చేష్టలు చేసుకుంటూ ఆసుపత్రిలో చేరితే అక్కడ ఉన్న డాక్టర్లకు ఈ మత్తు ఏంటో దీనికి విరుగుడు ఎలాంటి మెడిసిన్ వాడాలో తెలియక పేషెంట్లను కూడా తిరిగి పంపించేసిన దా కలలు కోకోలలు. కల్తీకల్లు వ్యాపారం కోట్లలో జరుగుతున్న అధికారులు మాత్రం నిర్లక్ష్య ధోరణితో వివరిస్తున్నారు. కనీసం కల్లు అమ్మే వ్యాపారులు ఆ కల్లు తీసుకున్న వ్యక్తికి కల్లుకొన్నట్టు రసీదు కూడా ఇవ్వరు రసీదు లేకుండా అక్కడ కల్లు కొగోలు చేసినట్టు ఆధారాలు కూడా ఉండవు అధికారులు ఇకనైనా కళ్ళు తెరిచి ప్రజలు వినియోగదారులకు కల్లు కొన్న సమయంలో బిల్లు ఇచ్చే విధంగా ఆదేశాలు జారీ చేసి ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు