
*మేకల విక్రయ కేంద్రం కొరకు స్థల పరిశీలన చేసిన అధికారులు*
నిజామాబాద్, మే 03(నిఘా నేత్రం విలేకరి )నగరంలో మేకల మండి పూర్వం నుండి బోధన్ రోడ్డు మటన్ మార్కెట్ ప్రక్కన కొనసాగుతుంది. బోధన్ రోడ్డు మటన్ మార్కెట్ నూతన నిర్మాణం కొరకు ఆ స్థలాన్ని ప్రభుత్వం తీసుకోవడం వలన మేకలు అమ్మే ఆరెకటిక కులస్తులకు ఆ స్థలం ఖాళీ చేసి వెళ్లవలసి వస్తుంది. అందుచేత వేరే చోట స్థలం ఏర్పాటు చేసి ఇచ్చినట్లయితే మేము అక్కడ మేకలు విక్రయించుకుంటామని గత కొన్ని రోజుల క్రితం మహేష్ కుమార్ గౌడ్ ను ఆరికటిక పెద్దలు బిల్లీ శంకర్ సయ్యాజీ లాల్ ఇతర కుల పెద్దలు కలిశారు. నుడా ఛైర్మన్ కేశవేణు మున్సిపల్, రెవెన్యూ అధికారులతో కలిసి శనివారం స్థలం పరిశీలించారు. ఇప్పటి వరకు ఉన్న హైమది మార్కెట్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో కసాబ్‌గల్లి వాసుల విజ్ఞప్తి మేరకు వేరే చోట స్థలన్ని పరిశీలిస్తున్నట్లు కేశ వేణు పేర్కొన్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆదేశాల మేరకు స్థలం పరిశీలించారు. ఆయన వెంట ఆర్డీవో స్రవంతి, మున్సిపల్ అధికారులు, తహశీల్దార్ బాలరాజ్ ఉన్నారు.