
*దేశం కోసం మేము సైతం సిద్ధం*
నిజామాబాద్ మే 11.(నిఘానేత్రం ప్రతినిధి) ఈరోజు ఉదయం కలెక్టర్ గ్రౌండ్ వాకింగ్ అసోసియేషన్ వారు దేశ సైనికుల కొరకు సంఘీభావం తెలపడానికి మేమున్నామని దేశం కోసం మేము సైతం సిద్ధమని ముక్తకంఠంతో వందల సంఖ్యలో ఊరేగింపుతో దేశ సైనికుల కోసం సంఘీభావం తెలిపారు. ఈ యుద్ధంలో పాకిస్తాన్ వాళ్లను దీటుగా ఎదుర్కొని దిటైనా సమాధానం ఇవ్వడం జరిగింది.
మేము మీతో గెలవలేము మమ్మల్ని క్షమించి యుద్ధం విరమించండి మహాప్రభో అంటూ వేడుకున్నారు. దీనికి మన కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. జాలి కరుణ లేని పాకిస్తానీలు గెలవలేక మోదీ ఎదుట నిలువ లేక మమ్మల్ని కాపాడండి మహాప్రభు అని వేడుకుంటూ మొరపెట్టుకున్నారు. మతోన్మాదంతో ఉగ్రవాదులను పెట్టి పోషించే పాకిస్తాన్ ప్రభుత్వం మోకాళ్లపై కూర్చుని వేడుకుంటుంది అంటే అది ఒక మోడీ వల్లనే సాధ్యమైందని దేశ ప్రజలు గర్వపడుతున్నారు. మేము సైతం మీతో ఉన్నామని సంఘీభావం తెలపడం జరిగింది ఈ సంఘీభావ ర్యాలీలో గడ్డం మనోహర్ మూడ శ్రీనివాస్ సంజీవ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు