
*తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలో రాకుండా అడ్డుకుంటున్నది ఎవరో కాదు బిజెపి కేంద్ర నాయకత్వమే?* *గత ఎన్నికల ముందు తెలంగాణలో బిజెపి పోటీ చేసి అధికారం కైవసం చేసుకుంటుందనుకునే సమయంలో బండి సంజయ్ ని మార్చి పార్టీ కార్యకర్తలను ప్రజలను విస్మయానికి గురిచేసింది* *బిజెపిలో ఎందరో బలమైన నాయకులు ఉండగా పార్టీకి నష్టం కలిగే విధంగా బలహీనమైన నాయకునికి రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టారని బాధతో రాజాసింగ్ రాజీనామా* *బిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడానికి బలహీనమైన నాయకుడికి రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టారని కార్యకర్తలు పార్టీ నాయకులు ఆక్రోషంతో ఉన్నారు* *హిందుత్వ నినాదంతో హిందువులను మోసం చేస్తున్న బిజెపి పార్టీపై ప్రజలు ఆవేశంతో ఉన్నట్టు తెలుస్తుంది*
హైదరాబాద్ జూన్ 30: (నిఘానేత్రం ప్రతినిధి) రాబోయే సాధారణ ఎన్నికల్లో ఎలాగైనా బిజెపి అధికారంలో వస్తుందని ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న ప్రజలకు నాయకులకు కేంద్ర నాయకత్వం నిరాశపరిచిందనే చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలో వస్తుందని కార్యకర్తల్లో పార్టీ వర్గాల్లో ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న సమయంలో సత్తా లేని నాయకుడిని రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నిక చేయడం తెలంగాణ ప్రజలను తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా కేంద్ర నాయకత్వం వ్యవహరిస్తుందని
రాజసింగ్ రాజీనామా చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర బిజెపి పార్టీకి ఎంతో నష్టం చేకూరుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. బిఆర్ఎస్ పార్టీ గతంలో ఓడిపోయి పార్టీకి బలం లేకుండా పోయింది అందులో కవిత అరెస్టుతో పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీలో కుటుంబ తగాదాలతో కవిత పార్టీలో సరైన ప్రాధాన్యత దొరకట్లేదని అన్నతో తండ్రితో తగువుకి దిగి తన జాగృతి ద్వారా కార్యక్రమాలను ఉదృతం చేసి కొత్త పార్టీ ఏర్పాటు చేసి రాష్ట్రంలో అధికారం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు అందరికీ తెలిసిన విషయమే ఇలా బిఆర్ఎస్ పార్టీ తన బలహీన పడిన సమయంలో అందరూ బిజెపి ఇలాగైనా రాష్ట్రంలో గెలుస్తుందని అభిప్రాయంతో ఉన్న తరుణంలో ఇలాంటి నిర్ణయం రాష్ట్ర ప్రజలకు నిరాశ కల్పించింది. తెలంగాణలో బిజెపి పార్టీ గెలిచే అవకాశాలు ఎన్నో ఉన్నా కేంద్ర నాయకత్వమే కావాలని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రాకుండా చేస్తుందని బిజెపి నాయకుల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజానికి తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలో వస్తుందా అని అనుకుంటే ప్రజల నాడి ప్రకారము ప్రజలు కసితో ఈసారి కచ్చితంగా బిజెపికి ఓటు వేసి మన హిందుత్వాన్ని నిలబెట్టుకొని మన సత్తా చాటుదామని కసితో ఉన్న తరుణంలో బలమైన నాయకులు ఎందరో ఉన్న ఒక బలహీన నాయకునికి తెలంగాణ రాష్ట్ర పగ్గాలు అతని చేతిలో పెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రాబోయే సాధన ఎన్నికల్లో ప్రజల ఆకాంక్ష ఈసారి కూడా నెరవేరేతట్టు లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బలహీన నాయకుడిని రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నుకునే ప్రక్రియలో బిఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ పాత్ర కీలకంగా ఉన్నట్టుగా సమాచారం దానికి కారణం రాబోయే సాధారణ ఎన్నికల్లో బిజెపితో బిఆర్ఎస్ పొత్తు ఏర్పరచుకొని ఎలాగైనా కాంగ్రెస్ పార్టీని ఓడించి రెండు పార్టీల కలయికతో తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ విజయం సాధించాలని తపనతో బలహీన నాయకుడికి బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కినట్టయితే మేము నిశ్చింతగా అధిక సీట్లు సాధించగలమనే ధీమాతోనే కెసిఆర్ చక్రం తిప్పినట్టు బిజెపి నాయకులు అనుమానాలను వ్యక్తపరుస్తున్నారు