స్టేడియం ఏర్పాటుతో పాటు ఇండోర్ స్టేడియం కు శంకుస్థాపన చేస్తాం
- నిజామాబాద్ నిఘానేత్రం ప్రతినిధి: నిజామాబాద్ పట్టణంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా 8 ట్రాక్ లతో స్టేడియం ఏర్పాటుతో పాటు ఇండోర్ స్టేడియం కు శంకుస్థాపన చేస్తాం
నిజామాబాద్ జిల్లా ఒలంపిక్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొని అధికారులతో కలిసి గ్రౌండ్ ను పరిశీలించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
ఈ సందర్భంగా మాట్లాడుతూ
నిజామాబాద్ పట్టణ నడిబొడ్డులోఉన్న
క్రీడా ప్రాంగణ స్థలాన్ని గత ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అమ్మివేయాలని చూసింది
ఎందరో పోరాటం చేసి ధర్నాలు చేసి ప్రభుత్వంతో కొట్లాడి స్థలాన్ని అమ్మకుండా ఆపారు
మీ పోరాట ఫలితంగా ఈరోజు స్టేడియం మరియు ఇండోర్ స్టేడియం నిర్మాణం చేసుకుందాం
తెలంగాణ ప్రభుత్వం హకీంపేట్ లో 200 ఎకరాల్లో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది
తెలంగాణలోని క్రీడాకారులకు ఇది ఒక గుడ్ న్యూస్ మీరు విశ్వ క్రీడల్లో ఛాంపియన్ గా నిలిచే అవకాశం తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తుంది
ఇక మీ పిల్లల్ని ఛాంపియన్లుగా చూడొచ్చు
మనదేశంలో స్పోర్ట్స్‌కి అంత ప్రాధాన్యత ఇవ్వరనే అపవాదు ఉంది. స్కూళ్లల్లో పిల్లలకు చదువులు తప్ప. ఆటలపై ప్రత్యేక దృష్టి పెట్టేలా వ్యవహరించరు.
దీంతో ఒలంపిక్స్ వంటి విశ్వవేదిక క్రీడల్లో మన దేశానికి పెద్దగా పతకాలు రావటం లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీ (ఫోర్త్ సిటీ)లో నిర్మించే స్పోర్ట్స్ హబ్‌లో దీన్ని ఏర్పాటు చేయాలని చూస్తున్నది మా ప్రభుత్వం.
దాదాపు 12 వివిధ క్రీడల అకాడమీలను ఇక్కడే పెట్టాలని భావిస్తున్నది.
వీటిలో అంతర్జాతీయ స్థాయి అధునాతన మౌలిక సదుపాయాలు ఉంటాయి.
ఈ స్పోర్ట్స్‌హబ్‌లో స్పోర్ట్స్ సైన్స్ సెంటర్, స్పోర్ట్స్ మెడిసిన్ సెంటర్ కూడా ఉండేలా ఏర్పాట్లు చేయనున్నారు.
ఇక్కడ కూడా ఒలంపిక్స్ స్థాయి ప్రమాణాలతో క్రీడా అకాడమీలు ఏర్పాటు చేసుకుందాం
ఇక్కడ అరకోర సదుపాయాలతోనే ప్రపంచ సాయి క్రీడాకారులు మాలావత్ పూర్ణ . నికత్ జరీన్. హుసమోద్దీన్. ఎండల సౌందర్య. దేశం గర్వించదగ్గ స్థాయిలో నిలిచారు
ఒలంపిక్ స్థాయిలో శిక్షణ ఇచ్చి దేశంలోనే నిజామాబాద్ కు ప్రత్యేక స్థానంలో నిలుపుదాం అన్నారు.