విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేసేది మీరే
నిజామాబాద్ నిఘానేత్రం ప్రతినిధి: ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
R&B గెస్ట్ హౌస్ లో ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా జిల్లా కు చెందిన ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించి అనంతరం లిటిల్ జెమ్స్ హై స్కూల్ లో ఉపాధ్యాయ దినోత్సవ
వేడుకల్లో పాల్గొన్నారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ
బతకలేనివారూ బడిపంతులు అందరూ. కానీ బతుకు నేర్పిన వాళ్ళు బడిపంతుల్లు
ప్రతి ఒక్కరి జీవితంలో ఉపాధ్యాయులది ప్రత్యేక పాత్ర.
జీవితంలో మొదటి గురువు తల్లి. అక్కడినుంచి పాఠశాలలో మీకు విద్య నేర్పిన ప్రతి గురువు మీ జీవితంలో మీ ఎదుగుదలకు కారకులు.
మనకు జ్ఞానాన్ని బోధించి, ముందుకు సాగడానికి సన్మార్గ బోధన చేసేది గురువు.
మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా మనమంతా సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే జరుపుకుంటామని తెలిపారు.
సమున్నత జాతి నిర్మాణంలో ఉపాధ్యాయులు, అధ్యాపకుల పాత్ర అనిర్వచనీయం.
దేశానికి జ్ఞాన సంపన్నులైన, అంకితభావం కలిగిన యువతను అందించేందుకు పాఠశాల, కళాశాల దశల నుంచే బోధన బాధ్యతల్లో ఉన్నవారు తపిస్తారు.
ఉపాధ్యాయుల గౌరవ మర్యాదలను ఈ ప్రభుత్వం కాపాడుతుంది అని చెప్పారు
గత ప్రభుత్వ హయాంలో విద్యావ్యవస్థ చిన్న భిన్నం అయిపోయింది
యువతను మాదక ద్రవ్యాల వైపు మళ్ల కుండా పరిరక్షించే బాధ్యత మీదే అని చెప్పారు