Home

పోషణ మాసం 2024 ప్రారంభం

*మహిళా, శిశు, వికలాంగుల మరియు వృద్ధుల సంక్షేమ శాఖ*

నిజామాబాద్ నిఘానేత్రం ప్రతినిధి: నిజామాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీ అంకిత్ గారు మరియు జిల్లా సంక్షేమాధికారి శ్రీమతి యస్ కే రసూల్ బి అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్),డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ శ్రీమతి రాజ శ్రీ, డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్ సాయగౌడ్,డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ ,డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ పాల్గొని 7వ రాష్ట్రీయ పోషణ మాసం (పోషణ మాహ్) 2024 కార్యక్రమాలను ప్రారంభిస్తూ, ప్రత్యేకంగా రూపొందించిన పోస్టర్‌ను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమాలు సెప్టెంబర్ 1 నుంచి 30, 2024 వరకు అందరూ సహకరించాలని అలాగే అతి తీవ్ర లోప పోషణ పిల్లలను sam పిల్లలను ఐసి డి యస్ మరియు మెడికల్ ఆఫీసర్ సమన్వయముతో ఫాలో అప్ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమములో భీంగల్ ఇంచార్జ్ సి డిపి వోఐ స్వర్ణలత ఆర్మూర్ ఇంచార్జ్ సి డిపి వో ఆర్ జ్యోతి, డిచ్ పల్లి ప్రాజెక్ట్ సి డిపి వో స్వర్ణలత గారు, బోధన్ ఇంచార్జ్ సి డి పి వో రాధికా, నిజామాబాద్ అర్బన్ ఇంచార్జ్ సి డి పి వో జి నందిని, ఐ సి డి యస్ మరియు హెల్త్ సూపర్ వైజర్లు, పోషన్ అభియాన్ సిబ్బంధి , dhew సిబ్బంధి .

 

ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ శ్రీ అంకిత్ గారు మాట్లాడుతూ, పోషణ మాసం అనేది దేశవ్యాప్తంగా పోషకాహారంపై అవగాహన కల్పించడం మరియు పిల్లలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు మరియు బాల్య స్థితిలో ఉన్న యువతుల పోషక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చేపడుతున్న ఒక గొప్ప కార్యక్రమం అని చెప్పారు. ఈ ఏడాది పోషణ మాసం ప్రత్యేకంగా వృద్ధి మానిటరింగ్, రక్తహీనత నివారణ, అనుబంధ ఆహారం, పోషణ భి పడాయి భి మరియు సాంకేతికత ఉపయోగం వంటి అంశాలపై దృష్టి సారించాలని ఆదేశించారు .

 

కార్యక్రమాల నిర్వహణ కోసం జిల్లా, ప్రాజెక్ట్, మరియు ఆంగన్వాడీ కేంద్ర స్థాయిల్లో వివిధ కార్యకలాపాలు నిర్వహించబడతాయి. ఇందులో అనేక డిపార్ట్మెంట్లు కలిసి పని చేస్తూ, అవగాహన కార్యక్రమాలు, రక్తహీనత పరీక్షలు, క్రమపద్ధతిలో ఆహారం పంపిణీ, మరియు ఇతర ఆరోగ్యకరమైన చర్యలను అమలు చేయాలని ఆదేశించారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button