Politics
*ఎట్టకేలకు మహేష్ కుమార్ గౌడ్ కె తెలంగాణ టీపిసిసి పగ్గాలు*
నిజామాబాద్ నిఘానేత్రం ప్రతినిధి: మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో అంచలంచలుగా ఎదిగి ఎన్నో ఉన్నత పదవులను అధిరోధించి కాంగ్రెస్ పార్టీలో తనకంటూ ప్రత్యేకత చాటుకున్న మహేష్ కుమార్ కు టీపిసిసి పదవి రావడం. నిజామాబాద్ జిల్లా వాసి బీసీ వర్గానికి చెందిన వ్యక్తికి దక్కడం నిజాంబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ప్రజల్లో ఎంతో ఉత్సాహం వెళ్లి విరుస్తుంది. ప్రజలతో పార్టీ నాయకులతో సౌమ్యంగా ఉంటూ ఎవరిని నొప్పించకుండా తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుని ఎన్ని కష్టాలు వచ్చినా కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ పెద్దలను నమ్ముకొని ముఖ్యమంత్రి తో వెన్నంటూ ఉండి తెలంగాణ రాష్ట్రంలోకాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావడానికి కృషి చేసిన వ్యక్తి మహేష్ కుమార్ గౌడ్ తన కృషికి తగ్గ ఫలితాన్ని దక్కిందని రాష్ట్ర ప్రజలు సంతోషిస్తున్నారు