Politics
మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో బుధవారం నిర్వహించిన ప్రజావాణి
హైదరాబాద్, నిఘానేత్రం ప్రతినిధి సెప్టెంబర్ 11 :: మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో బుధవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 527 దరఖాస్తులు అందాయి. రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 80, విద్యుత్ శాఖ కు సంబంధించి 79, మైనారిటీ వెల్ఫేర్ కు సంబంధించి 68, పంచాయతి రాజ్ మరియు గ్రామీణాభివృద్ది శాఖ కు సంబంధించి 63, ఇతర శాఖలకు సంబంధించి 237 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డా.చిన్నారెడ్డి, ప్రజాపాలన ప్రత్యేక అధికారి శ్రీమతి దివ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్ని దరఖాస్తులు స్వీకరించారు. ప్రజాభవన్ కు వచ్చిన వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.