ఇంజనీరింగ్ కాలేజీగా అప్గ్రేడ్ చేయాలి* *ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీకి PDSU వినతి*
*
నిజామాబాద్ ( నిఘానేత్రం ప్రతినిధి) సెప్టెంబర్ 11 నిజామబాద్ జిల్లా కేంద్రంలో గల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్గ్రేడ్ చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ, నిజామబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా మార్చడం ద్వారా నిజామబాద్ జిల్లా విద్యార్థులకే గాక మిగతా జిల్లా విద్యార్థులకు కూడా సాంకేతిక విజ్ఞానం అందుతుందని తెలిపారు. పేద మధ్యతరగతి విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్య సర్వే అవకాశం అందుతుందని తెలిపారు. ముఖ్యంగా జిల్లా విద్యార్థినీలకు ఇంజనీరింగ్ చదవాలని కోరిక ఉన్న ఆర్థిక భారం లేదా అనేక రకాల సమస్యలతో తల్లితండ్రులు పంపలేకపోతున్నారని తెలిపారు. నగరంలో ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు డిజిటల్ రంగం వైపు అడుగులు వేస్తారని కోరారు. ఇంజనీరింగ్ కళాశాల అనేది నిజామాబాద్ ప్రజల,విద్యార్థుల ఆకాంక్ష అని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నిజామబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ఇంజనీరింగ్ మరియు బాలికల డిగ్రీ కళాశాల మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అన్ని రకాలుగా సౌకర్యాలు కలిగి ఉన్నదని తెలిపారు.
ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ స్పందిస్తూ, నిజామబాద్ నగరంలో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల కచ్చితంగా ఇంజనీరింగ్ కాలేజీగా తీర్చిదిద్దుతారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో PDSU నాయకులు నాగేష్,సలీం, నసీర్,సృజన్, నితిన్ తదితరులు పాల్గొన్నారు.