దొషులను కఠినంగా శిక్షించాలి* -అర్బన్ ఎమ్మెల్యే
నిజామాబాద్, సెప్టెంబర్ 11(నిఘానేత్రం ప్రతినిధి )
నిజామాబాద్ నగరంలోని గాజుల్ పేట బోయి గల్లీలో వినాయకుని విగ్రహం ద్వంసం జరిగిన సంఘటన స్థలాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా పరిశీలించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు గణపతి నవరాత్రుల సందర్బంగా ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహం చేతులు విరగగొట్టి కిరీటన్ని ద్వంసం చేయడం హెయమైన చర్య అని అన్నారు.యావత్ హిందూ సమాజం ఎంతో భక్తి శ్రద్దలతో పూజించే హిందువుల ఆరాధ్య దైవం అయిన వినాయకుని విగ్రహం పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఇలాంటి దుశ్చర్యకు పాల్పడిన వారిని 24 గంటల్లో పట్టుకొని దొషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని ఏసీపీ తో ఫోన్ లో మాట్లాడి ఆదేశించడం జరిగింది.గణపతి నవరాత్రులు ముగిసే వరకు పోలీస్ సిబ్బంది ఎప్పటికప్పుడు గస్తీ కాస్తూ ఎటువంటి అవంతరాలు జరగకుండా చూడాలని అవసరమైన ప్రదేశాల్లో పోలీస్ భద్రత పెంచాలని పోలీస్ శాఖను అదేశించారు.ఈ కార్యక్రమంలో రెండవ టౌన్ ఎస్సై , 28వ డివిజన్ కార్పొరేటర్ ఇల్లందుల మమత ప్రభాకర్ , బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ , నందు, గణేష్ మండప నిర్వాకుడూ శివరత్రి సంతోష్, విశ్వహిందూ పరిషత్ నాయకులు దాత్రిక రమేష్ , బిజెపి నాయకులు ఆనంద్,హరీష్, బాబీ సింగ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.