*బాలికలు పౌష్టికాహారం తీసుకోవాలి* *జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్*
కామారెడ్డి సెప్టెంబర్ 12 (నిఘానేత్రం ప్రతినిధి )
బాలికలు రక్తహీనత లేకుండా పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అన్నారు. గురువారం మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏడవ జాతీయ పోషణ మాసం లో భాగంగా కే, జీ బి.వి కామారెడ్డి మండలం టేక్ రియల్ జెడ్ పి హెచ్ ఎస్ లో పాఠశాల విద్యార్థులకు రక్తహీనత పరీక్ష శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రక్తహీనత పట్ల విద్యార్థినిలకు అవగాహన కల్పిస్తూ రక్తహీనతను తగ్గించుటకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రక్తహీనత లేకుండా పోషక విలువలతో కూడిన హారం తీసుకోవాలని తగిన వైద్య పరీక్షలు చేసుకోవాలని అవసరమైన చికిత్సలు తీసుకోవాలని సూచించారు. అలాగే అన్ని పాఠశాలల్లో కిషోర్ బాలికలకు తగిన పరీక్షలు ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో 363 మంది విద్యార్థులకు రక్తహీనత పరీక్షలు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి, వైస్ చైర్మన్ ఉర్దూండ అనిత రవి, డి ఎం హెచ్ ఓ చంద్రశేఖర్, డీఈఓ రాజు, సిడిపిఓలు సూపర్వైజర్లు హెల్త్ డిపార్ట్మెంట్ స్టాప్ ఉపాధ్యాయులు అంగన్వాడి టీచర్లు ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
.