*టీ ఫ్రైడ్ పథకం కు పెట్టుబడి రాయితీ* -జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్
కామారెడ్డి సెప్టెంబర్ 13 (నిఘానేత్రం ప్రతినిధి )
టీ ఫ్రైడ్ పథకం కింద పెట్టుబడి రాయితీ మంజూరు చేస్తున్నట్లు జిల్లా ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ తెలిపారు. శుక్రవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఐ – పాస్ క్రింద నలుగురు ఎస్సీ లబ్ధిదారులకు రు. 13 లక్షల 89 వేల 491 లు, ఎనిమిది మంది ఎస్టీ లబ్ధిదారులకు 23 లక్షల 80 వేల 529 లు పెట్టుబడి రాయితీ మంజూరుకు కమిటీ ఆమోదిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ లాలు నాయక్, ఎల్.డి.ఏం. రవికాంత్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారిని రజిత, మున్సిపల్ కమీషనర్ సుజాత, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, జిల్లా భూగర్భ శాఖాధికారి సతీష్, ఆర్.టీ. ఒ . శ్రీనివాస్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.