Politics

*నిమజ్జనం విజయవంతానికి ప్రజలందరూ సహకరించాలి*

హైదరాబాద్ సెప్టెంబర్ 13(నిఘానేత్రం ప్రతినిధి)గణేష్ నిమజ్జనం విజయవంతానికి ప్రజలందరూ సహకరించాలి

వినాయక చవితి సందర్భంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది

గణేష్ నిమజ్జనం వేడుకలను శాంతియూతంగా ఆనందంగా జరుపుకోవాలని గణేష్ నిమజ్జనాల సందర్భంగా రాజకీయ ర్యాలీలకు అనుమతి లేదు

రాజకీయాలకు అతీతంగా ఉత్సవాలు నిర్వహణ

శాంతి భద్రతలు కాపాడడంలో కఠినంగా వ్యవహరిస్తాం

ప్రజల్లో అపోహలు కలిగించిన వారిని ఉక్కు పాదంతో అణిచి వేస్తాంస్వేచ్ఛగా మంచి వాతావరణంలో పండుగ జరగాలి

ట్రాఫిక్ కు ఇబ్బందులు కలగకుండా చర్యలువేడుకల్లో అధికారులు అందరు సమన్వయంతో పనిచేయాలి.రాష్ట్ర రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.జంట నగరాల్లో జరిగే గణేష్ నిమజ్జనం ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో

జరిగేలా ప్రజలందరూ సహకరించాలని రాష్ట్ర రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన పత్రిక విలేకరుల సమావేశంలో జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సిపి ఆనంద్ లతో కలసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ సెప్టెంబర్ 17న అంగరంగ వైభవంగా చేపట్టే నిమజ్జన వేడుకలు రాజకీయాలకు అతీతంగా ప్రశాంతవాతావరణంలో జరగాలని అదిశగా ప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. గణేష్ నవరాత్రి ఉత్సవ వేడుకల సందర్బంగా ఇప్పటికే రాష్ట్ర ముఖ్య మంత్రి సూచనల మేరకు ఉన్నత అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులతో అలాగే జంట నగరాల్లో జిల్లా కలెక్టర్లు, పోలీస్ ఉన్నత అధికారులు జిల్లా స్థాయిలలో సమావేశాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. జంట నగరాల్లో ఎక్కడ కూడా ట్రాఫిక్ కి ఇబ్బంది కలగకుండా పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. నిమజ్జన వేడుకల్లో ఎక్కడైనా సమస్యలు, ఇబ్బందులు ఉంటే పోలీస్, రెవెన్యూ శాఖలకు సత్వారమే తెలపాలని అన్నారు. శాంతి భద్రతల విషయంలో పటిష్ట చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రజలు, ప్రజా ప్రతినిధులు పూర్తి సహకారం అందించాలని అన్నారు.

ఈ నెల 16న నిర్వహించే మీలాదున్ నబి పండుగను ముస్లిం మత పెద్దలు 19 న పండుగ చేసుకునేలా అంగీకరించినట్లు మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ ఐక్యత కు ప్రతీకగా నిలుస్తుందని, ఎక్కడైనా పండుగ నేపథ్యంలో అలజడులు సృష్టిస్తే కఠినంగా వ్యవహారిస్తామని స్పష్టం చేసారు. స్వేచ్ఛగా మంచి వాతావరణం లో గణేష్ పండుగ జరగాలని అన్నారు. ప్రజలందరూ సహకరించి పండుగ ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టే, అపోహలు సృష్టించే వారిని ఉక్కు పాదంతో అణిచివేస్తామని అన్నారు.జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ హైదరాబాద్ జిల్లాలో నిమజ్జన వేడుకలు శాంతియుత వాతావరణంలో నిర్వహిస్తామని ఇప్పటికే జిల్లా స్థాయిలో అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి విది విధానాలపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని అన్ని సెక్టర్లు, సర్కిల్స్, జోనల్స్ లలో ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశ్యం చేయడం జరిగిందని అన్నారు. బాలాపూర్, ఖైరతాబాద్ లలో గల విగ్రహాలు పెద్దగా ఉన్నందున పటిష్ట చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు.

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ మాట్లాడుతూ నిమజ్జనం సందర్బంగా శాంతి భద్రతల నిర్వహణలో పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం జరిగిందని నిమజ్జన వేడుకల్లో 15 వేల మంది, ఇతర జిల్లాల నుండి 3 వేల మంది కేటాయించి పోలీసులు విధులు నిర్వహిస్తున్నట్లు ఇంకను 8 వేలమంది పోలీసులను విధులకు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ వేడుకల సందర్బంగా ప్రభుత్వం నిధులు కేటాయించి పూర్తిగా సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. నిమజ్జన వేడుకలలో ప్రజలు ట్రాఫిక్ ఇబ్బందులు పడకుండా మల్లింపు చర్యులు తీసుకోవడం జరుగుతుందని, ప్రజలు, ఉత్సవ కమిటీ సభ్యులు సహకరించాలని అన్నారు.

ఈ సమావేశంలో జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి, అదనపు కలెక్టర్ రెవెన్యూ వెంకటాచారి, పోలీస్, జిహెచ్ఎంసి అధికారులు, పాత్రికేయులు, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button