Politics
*రాష్ట్రం లో కుల గణన విషయమై చేపట్టే విధివిధానాల గురించి సవివరంగా చర్చించడం జరిగింది*
హైదరాబాద్ సెప్టెంబర్ 14:(నిఘానేత్రం ప్రతినిధి) రాష్ట్ర పంచాయత్ రాజ్ సెక్రెటరీ లోకేష్ కుమార్ డి.ఎస్., ఐఏఎస్, కమిషనర్ అనితా రామచంద్రన్, ఐఏఎస్. డిప్యూటీ కమిషనర్ సుధాకర్ ఈ రోజు ఉదయం 11:30 గం. లకు తెలంగాణ బీసీ కమిషన్ కార్యాలయం కు విచ్చేసి తెలంగాణ బీసీ కమిషన్ ఛైర్మన్ జి.నిరంజన్, సభ్యులు శ్రీ రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాల లక్ష్మి సభ్యకార్యదర్శి బాల మాయ దేవి, ఐఏఎస్ గార్లతో సమావేశమై రాష్ట్రం లో కుల గణన విషయమై చేపట్టే విధివిధానాల గురించి సవివరంగా సుమారు రెండు గంటల పాటు చర్చించడం జరిగింది. అతి త్వరలో కులగణన విషయమై ఒక కార్యాచరణ ప్రకటించాలని భావించడం జరిగింది. తొందర్లో క్షేత్రస్థాయి పరిశీలనకు జిల్లాల వారిగా పర్యటించే షెడ్యూల్ విడుదల చేయడం జరుగుతుంది.