*మిలాద్-ఉన్-నబీ ఊరేగింపు, నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు* -జిల్లా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్
*
నిజామాబాద్ , సెప్టెంబర్ 14( నిఘానేత్రం ప్రతినిధి )
ముస్లీంల పవిత్ర దినమైన మిలాద్- ఉన్ నబీ పండుగ సందర్భంగా నిజామాబాద్లో ఈ నెల 16న భారీ ఊరేగింపు జరగనుంది. ఈ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా నిజామాబాద్ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ నెల 16న ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు భారీ ఊరేగింపు కారణంగా కొన్ని మార్గాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధించి, దారి మళ్లింపు చేసినట్లు జిల్లా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనెవర్ ప్రకటించారు. బోధన్ వైపు నుండి వచ్చే వాహనాలు అర్పపల్లి చౌరస్తా, అర్సపల్లి రైల్వే గేట్, న్యూ కలెక్టరేట్, కాలూర్ చౌరస్తా, ఖాజా హోటల్, బైపాస్, ఎన్టీఆర్ చౌరస్తా మీదుగా ఆర్టీసీ బస్టాండ్ కు వెళ్ళాలని పేర్కొన్నారు. అలాగే నిజామాబాద్ నుంచి బోధన్ వైపు వెళ్ళు వాహనాలు ఆర్టీసీ బస్టాండ్, రైల్వే ఫై ఓవర్, శివాజీ చౌక్, నిజాం కాలనీ, అర్సపల్లి రైల్వే గేట్ మీదుగా బోధన్ వైపు వెళ్లాలని సూచించారు.