*కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలుపర్చాలి*
*నిజామాబాద్ , సెప్టెంబర్ 14( నిఘానేత్రం ప్రతినిధి )
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఏకకాలంలో ఎలాంటి షరతులు లేకుండా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ,రెండు పంటలకు రైతు భరోసా 15000 రూపాయలు యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని,సెప్టెంబర్16వ తేదీ ఆర్మూర్ డివిజన్ పరిధిలో అన్ని తహసిల్ కార్యాలయల ముందు నిరసన కార్యక్రమం నిర్వహించాలని రైతు జేఏసీ పిలుపునిచ్చింది.అఖిలభారత ప్రగతిశీల రైతు సంఘం కార్యాలయం కుమార్ నారాయణ భవన్ ఆర్మూర్లో ఈరోజు రైతు ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ ) పాత్రికేయ మిత్రుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు.వి . ప్రభాకర్, లింగారెడ్డి,దేగామ్ యాదగౌడ్ లు మాట్లాడుతూ 16వ తేదీన ఆర్మూర్ డివిజన్ పరిధిలో మాట తప్పిన కాంగ్రెస్ కు నిరసనగా ధర్నాలు చేయాలని పిలుపునిచ్చారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆరు గ్యారెంటీలను అందులో ప్రధానంగా ఏ రైతు అడగకముందే ఏకకాలంలో ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని రెండు పంటలకు కలిపి 15000 రూపాయలు రైతు భరోసా ఇస్తానని హామీ ఇచ్చి అధికరణకు వచ్చి 9 మాసాలు గడుస్తున్న రైతు భరోసా కు అతిలేదు ,గతి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం రుణమాఫీలో రైతుల్ని మోసం చేసిందని మైకులు పగిలిపోయే విధంగా ఉపన్యాసాలు ఇచ్చి అధికారంలోకి రాగానే నామ్కే వాస్తే లక్ష యాభై వేల రూపాయల వరకు అందులో కూడా అందరికీ కాకుండా కొంతమేరకే రుణమాఫీ చేసి 2 లక్షల రుణమాఫీ ప్రారంభం కూడా కాలేదని ఎద్దేవా చేశారు.
ఇప్పటివరకు చేసిన రుణమాఫీ 40 నుండి 50 శాతం కూడా పూర్తి కాలేదని గత ప్రభుత్వాలు అనుసరించిన విధానాల్ని ఈ ప్రభుత్వం అనుసరిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని పంటలకు 500 రూపాయల బోనస్ ఇచ్చి, మాట నిలబెట్టుకుని యోచినే చేయడం లేదని ఇది చేతుల ప్రభుత్వం కాదని మాటల ప్రభుత్వం అని అన్నారు.
గత నెల 24వ తేదీన ఆర్మూర్. బాల్కొండ. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల రైతులు వేలాదిమంది ఆర్మూర్ హైవే రోడ్డుపై నిరసన వ్యక్తం చేసి ఈ నెల 15వ తేదీ లోపు పూర్తిస్థాయిలో ఎలాంటి షరతులు లేకుండా. కుటుంబ నిర్ధారణ లేకుండా పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ.. 2 లక్షలకు పైగా అప్పు ఉన్న రైతులు పైన అప్పు చెల్లిస్తే ఈ స్కీమ్ వర్తిస్తుందని ఆటంకపరచడం సరికాదని బె శరత్తుగా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతు భరోసాను. రుణ మాఫీ ని యుద్ధ ప్రాతిపదికను అమలు చేయాలని.. అన్ని పంటలకు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.. ఈ పాత్రికేయ మిత్రుల సమావేశంలో నాయకులు బి దేవారం. ఆకుల గంగారాం.. తదితరులు పాల్గొన్నారు.