*నీలకంటేశ్వరాలయంలో మహా అన్నదానం*
**నిజామాబాద్ , సెప్టెంబర్ 14( నిఘానేత్రం ప్రతినిధి)
గణపతి నవరాత్రుల సందర్బంగా నీల కంటేశ్వర్ ఆలయంలో ఎర్పాటు చేసిన పూజ,అన్నదానం కార్యక్రమంలో ముఖ్యఅతిగా అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు:సనాతన ధర్మ రక్షణకై యావత్ హిందూ సమాజం యువతీ యువకులు చిన్నారులంతా కలిసి భక్తిశ్రద్ధలతో గణపతి నవరాత్రులు నిర్వహించడం హిందువుగా గర్వించు దగ్గ విషయం అన్నారు. హిందువుల ఐక్యత 9 రోజులే కాకుండా భవిష్యత్తులోనూ హిందూ సమాజానికి హిందూ ధర్మానికి ఎటువంటి ఆపద వచ్చినా హిందువులంతా ఐక్యతతో జయించాలన్నారు. హిందువులపై జరుగుతున్న దాడులు దృష్టిలో పెట్టుకొని హిందువులంతా ఏకం కావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు నాగోళ్ళ లక్ష్మీనారాయణ , బీజేపీ నాయకులు ఆనంద్, పవన్ ముందడ,కార్తీక్,హరీష్, శేఖర్,తదితరులు భక్తులు పాల్గొన్నారు.