*ఆధ్యాత్మికతతోనే ప్రశాంతత* -నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో వైభవంగా భజన సంకీర్తనలు..
*
నిజామాబాద్, సెప్టెంబర్ 14( నిఘా నేత్రం ప్రతినిధి )
ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందని మేఘన సుబేదార్, రాజ్ కుమార్ సుబేదార్, భజన బృందం తెలి పారు. శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ గణేష్ మండలి లో భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైట్ల సుబ్బారావు, అవి నాష్, భాస్కర్ (న్యాయవాది) మేఘన సుబేదార్, రాజ్ కుమార్ సుబేదార్, సంతోష్ సుబేదార్, సునీల్, అశోక్, దత్తు, శివ (లడ్డు)భజన బృంద సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భక్తి పారవశ్యంతో ఆలపించిన పాటలతో ప్రెస్ క్లబ్ ప్రాంతమంతా ఒక ఆధ్యాత్మిక వాతా వరణం నెలకొంది. భక్తిశ్రద్ధలతో విగ్నేశ్వ రుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భజన బృందం సభ్యులను ప్రెస్ క్లబ్, ఉత్సవ కమిటీ సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించారు. మండపం వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిం చారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కమిటీ ఉత్సవ కమిటీ సభ్యులు జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.