Politics

*53 శాతం ఇండ్లకు మంచినీరు ఇవ్వలేదు* *మిషన్ భగీరథలో భారీ అవినీతి* *వాస్తవాలు ప్రజలకు తెలియజేసి* *ప్రతి ఇంటికి మంచినీరు ఇస్తాం* *రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి*

హైదరాబాద్, సెప్టెంబర్ 19:(నిఘానేత్రం ప్రతినిధి) గత ప్రభుత్వం ఎంతో గొప్పగా ప్రచారం చేసుకున్న మిషన్ భగీరథలో భారీ అవినీతి, అక్రమాలు జరిగాయని, 46 వేల కోట్ల రూపాయల ఈ ప్రాజెక్టులో 15 వేల నుండి 20 వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మిషన్ భగీరథపై సర్వే నిర్వహించగా 53 శాతం ఇండ్లకు మంచినీరు అందడం లేదని భయంకరమైన విషయాలు వెలుగు చూసాయని వెల్లడించారు.

గురువారం నాడు వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర రాజనర్సింహా, దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ తో కలిసి ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రాంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రజలకోసం చేసినట్టుగా లేదని, వారి జేబులు నింపుకోవడానికి చేసినట్టుగా ఉందని విమర్శించారు.

వాస్తవాలను ప్రజలకు తెలియజేసి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తామని ప్రకటించారు. గత పదేండ్లలో ఎన్నడూ లేని విధంగా వ్యవసాయానికి బడ్జెట్ లో రూ.72 వేల కోట్లు కేటాయించిన ఘనత ఈ ప్రభుత్వానిది. 27 రోజుల్లో 23 లక్షల మందికి రూ. 18 వేల కోట్ల రైతు రుణాలను రద్దు చేశామని సాంకేతిక కారణాలతో కొంతమంది రైతులకు రుణమాఫీ ప్రయోజనం అందలేదని వీలైనంత త్వరలో వాటిని పరిష్కరించి ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన ప్రతి రైతన్నకు రుణమాఫీ చేస్తామని, అన్న మాట ప్రకారం 31 వేల కోట్ల రూపాయలకి ఇంకా కావాలంటే రెండు మూడు వందల కోట్లు ఎక్కువైనా పర్వాలేదు అర్హులైన ప్రతి రైతన్నకి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో రెండు లక్షల రూపాయలు వరకు రుణమాఫీ చేసి తీరుతుంది.

అర్హులైన ప్రతి ఒక్కరికీ హెల్త్ కార్డులు, రేషన్ కార్డులు వేరు వేరుగా అందించబోతున్నామని ప్రకటించారు. మరి కొద్ది రోజుల్లో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు వేయబోతున్నామని ప్రకటించారు. ఈ ప్రభుత్వం విద్యా వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడించారు.

ప్రాజెక్టుల పేరుతో మిషన్ భగీరథ పేరుతో వేల కోట్ల రూపాయలను కాజేసిన గత ప్రభుత్వ పెద్దలు తమ తప్పులు కప్పి పుచ్చుకోవడానికి ప్రతి దానిని రాద్ధాంతం చేయడం అలవాటు చేసుకున్నారని దుయ్యబట్టారు. వారి పాలనలో అవినీతి అక్రమాలు జరిగినట్టుగానే ఇప్పుడు కూడా జరుగుతున్నాయనే భ్రమలో బీఆర్ఎస్ నాయకులు జీవిస్తున్నారని ఎద్దేవా విమర్శించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button