*కోటి ఆశలతో ప్రజల చూపు మహేష్ కుమార్ గౌడ్ వైపు* *ఇందూరు బిడ్డ తన జన్మభూమికి న్యాయం చేయగలడా* *నిజామాబాద్ నుండి ఎంతో ఉన్నత శిఖరాలను అధిరోహించిన నాయకులు ఎందరో* *తమ తలరాతలు మార్చుకున్న నాయకులు ఎందరో * జిల్లా తలరాతను మాత్రం మార్చలేకపోయారు* *తరాలు మారుతున్న జిల్లా తలరాతలు మారటం లేదు* *ఎన్నోసమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఇందూరు నగరం*
నిజామాబాద్ సెప్టెంబర్ 23:(నిఘానేత్రం ప్రతినిధి) నిజామాబాద్ గడ్డపై జన్మించి శాంతి అనే ఆయుధాన్ని చేతబట్టి తన జీవితాన్ని కాంగ్రెస్ పార్టీకే అంకితం చేసి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని అంచలంచలుగా ఎదిగి ప్రత్యర్థుల అంచనాలను తారుమారు చేసి ఉన్న శిఖరాన్ని అధిరోహించిన మహేష్ కుమార్ గౌడ్ వైపు ప్రజలు ఆశతో ఎదురుచూస్తున్నారు. ఎందరో ముఖ్య నాయకులకు జీవితాన్ని ఇచ్చిన ఇందూరు గడ్డ ఇంత అద్భుత చరిత్ర కలిగిన ఈ గడ్డ తలరాతను మాత్రం ఏ నాయకుడు మార్చలేకపోయాడు. కింది స్థాయి నుండి అంచలంచలుగా ఎదిగి కష్టమంటే ఏంటో తెలిసిన వ్యక్తి రాష్ట్ర ఉన్నత పదవిలో ఉండడం. వారి యొక్క ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడడం తో. ఇందూరు ప్రజల్లో మహేష్ కుమార్ గౌడ్ పై కోటి ఆశలు పెట్టుకొని నిజామాబాద్ నగర అభివృద్ధి కోరుకుంటున్న ప్రజలు. నిజామాబాద్ నగరం సుందరీకరణ పనులు జరపకుండా రోడ్డు వెడల్పు కార్యక్రమాలు చేయకుండా మాస్టర్ ప్లాన్ అమలుకు నోచుకోకుండా ఇరుకురోడ్లతో ట్రాఫిక్ సమస్యలతో మురికి కాలువలతో దారుణ స్థితిలో ఉన్న నిజామాబాద్ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతారని మహేష్ కుమార్ గౌడ్ పై ప్రజల కోటి ఆశలు. గత ప్రభుత్వం కలెక్టర్ కార్యాలయం కలెక్టర్ బంగ్లా కలెక్టర్ గ్రౌండ్ డాక్రా బజార్ చుట్టుపక్కల ఉన్న స్థలాలను కూల్చి ప్రైవేటు పరం చేయాలనుకున్న గత ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకొని ప్రభుత్వ స్థలాలు ప్రభుత్వానికి ప్రజలకు ఉపయోగపడే విధంగా వాటిని ఉపయోగించాలని కలెక్టర్ గౌడ్ ను యధా స్థాయిలో నిర్మించాలని కలెక్టర్ గ్రౌండ్ పరిరక్షణ కోసం పోరాడుతున్న ప్రజల ఆకాంక్షను ఈ ప్రభుత్వం అర్థం చేసుకొని యధా స్థాయిలో కలెక్టర్ గ్రౌండ్ నిర్మిస్తారని ప్రజలు ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోట నిజామాబాద్ జిల్లా ఇంత ప్రాముఖ్యత కలిగిన జిల్లాకు కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకత్వం లేక కార్యకర్తలు ఎవరి నాయకత్వంలో పనిచేయాలో తెలియక అయోమయ పరిస్థితిలో ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో నిజామాబాద్ నగరం నుండి కామారెడ్డికి చెందిన మైనార్టీ బలమైన నాయకుడిని బరిలో దించిన కుల మతాల కారణంగా కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ నగర సీటును కోల్పోవడం జరిగింది. దీనికి కారణాలు లేకపోలేదు ఎన్నికల సమయంలో మైనార్టీ ప్రజలను నాయకులను ఏకం చేయడంలో షబ్బీర్ అలీ విజయం సాధించడం జరిగింది. మెజార్టీ ప్రజలను నాయకులను ఏకతాటిపై తీసుకురావడంలో విఫలమైనట్టు కొందరు కార్యకర్తలు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. జిల్లా సమస్యలపై దృష్టి పెట్టి జిల్లా ప్రజల సమస్యలను పరిష్కరించి జిల్లా తలరాతను మార్చిన ఘనత మహేష్ కుమార్ గౌడ్ పేరు చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు