*వస్త్ర షాపింగ్ మాల్ కు మున్సిపల్ అధికారుల నోటీసులు* *నోటిసులతోనే సరి పెడతారా చర్యలు తీసుకుంటారా*
నిజామాబాద్ ప్రతినిధి:(నిఘానేత్రం ప్రతినిధి)
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సెప్టెంబర్ 26 తేదీన ప్రముఖ నటి హీరోయిన్ నేహా శెట్టి చేతుల మీదుగా ప్రారంభం కానున్న వస్త్ర షాపింగ్ మాల్ కు మున్సిపల్ అధికారులు మంగళవారం నోటీసులు అందజేశారు. షాపింగ్ మాల్ నిర్వహణ కోసం సరైన అనుమతులు లేనందున, షాపింగ్ మాల్ రద్దీగా ఉండే ప్రాంతంలో ఏర్పాటు చేసి, పార్కింగ్, ఫైర్, సెట్ సైడ్, సెట్ బ్యాక్ లాంటి సౌకర్యాలు కల్పించని కారణంతో పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేసినందున మున్సిపల్ ఉన్నతాధికారులు
స్పందించి కమిషనర్ తో పాటు
టి పి ఓ సత్యనారాయణ, శ్యామ్ కుమార్ ల ఆదేశాల మేరకు చైర్మన్ యాసిన్ షాపింగ్ యజమానికి నోటీసులు అందజేసినట్లు తెలిపారు. నిబంధనలను తుంగలో తొక్కి వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకుంటారా నోటీసులతోనే సరిపెడతారా అన్నది మాత్రం వేచి చూడాల్సిందే.