*మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 365 దరఖాస్తులు అందాయి*
హైదరాబాద్, సెప్టెంబర్ 27:(నిఘానేత్రం ప్రతినిధి) మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 365 దరఖాస్తులు అందాయి. రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 105, విద్యుత్ శాఖ కు సంబంధించి 58, ఎస్సీ సంక్షేమ శాఖ కు సంబంధించి 42, పంచాయతి రాజ్ మరియు గ్రామీణాభివృద్ది శాఖ కు సంబంధించి 29, మైనారిటీ వెల్ఫేర్ శాఖకు సంబంధించి 26, ప్రవాసీ ప్రజావాణి ద్వారా 22, ఇతర శాఖలకు సంబంధించి 83 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డా.చిన్నారెడ్డి, ప్రజాపాలన ప్రత్యేక అధికారి శ్రీమతి దివ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్ని దరఖాస్తులు స్వీకరించారు. ప్రజాభవన్ కు వచ్చిన వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
శుక్రవారం ప్రారంభమైన ” ప్రవాసీ ప్రజావాణి ” కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి లు పాల్గొని దరఖాస్తులు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.