సీతారామ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ను త్వరితగతిన పూర్తి చేయాలి* *టెండర్ల ప్రక్రియను సత్వరమే పూర్తి చేయాలి* *భూసేకరణ అంశంలో అలసత్వం వలదు* *సాంకేతిక అనుమతుల విషయాలలో అధికారులు సమన్వయం చేసుకోవాలి* *పాలనాపరమైన అనుమతులలో వేగం పెంచాలి* *నిర్ణిత గడువు లోపు నిర్మాణాలు పూర్తి కావలి* *మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి*
*సీతారామ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ను త్వరితగతిన పూర్తి చేయాలి*
*టెండర్ల ప్రక్రియను సత్వరమే పూర్తి చేయాలి*
*భూసేకరణ అంశంలో అలసత్వం వలదు*
*సాంకేతిక అనుమతుల విషయాలలో అధికారులు సమన్వయం చేసుకోవాలి*
*పాలనాపరమైన అనుమతులలో వేగం పెంచాలి*
*నిర్ణిత గడువు లోపు నిర్మాణాలు పూర్తి కావలి*
*మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి*
హైదరాబాద్ సెప్టెంబర్ 27:(నిఘానేత్రం ప్రతినిధి)ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్ట్ ను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఆగస్ట్ 15 న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ ప్రాజెక్ట్ కు చెందిన పంప్ హౌజ్ లను ప్రారంభించిన విషయం విదితమే.
అందుకు సంబంధించిన టన్నెల్, కాలువల నిర్మాణాల పనుల పురోగతి పై శుక్రవారం రోజున జలసౌద లో సహచర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి లతో కలిసి నీటిపారుదల శాఖాధికారులతో సమీక్ష నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వ నీటిపారుదల శాఖా సలహాదారుడు అదిత్యా దాస్ నాధ్, ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ,ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్,ఇ.ఎన్.సి లు అనిల్ కుమార్,నాగేందర్ రావు లతో పాటు సీతారామ ప్రాజెక్ట్ సి.ఇ శ్రీనివాస రెడ్డి,ఖమ్మం జిల్లా సి.ఇ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ భూసేకరణ అంశంపై అలసత్వం చేయవద్దని సూచించారు.
అందుకు పాలనా పరమైన అనుమతులలో జాప్యం లేకుండా చూసుకోవాలన్నారు.
టెండర్ల ప్రక్రియ ను పూర్తి చేసేందుకు సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.
సాంకేతికాంశలలో అధికారులు పరస్పరం సమన్వయం చేసుకోవాలన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం నిర్ణిత గడువు లోపు ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేయాలన్నారు.