*పోలీసు శాఖ ఆధ్వర్యంలో లక్ష్మణ్ బాపూజీ జయంతి నిర్వాహణ వేడుకలు*
నిజామాబాద్ , సెప్టెంబర్ 27 (నిఘానేత్రం ప్రతినిధి )
నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కల్మేశ్వర్ సింగెనవార్, ఆదేశాలతో శుక్రవారం ఉదయం 11: 00 గం॥ల సమయంలో నిజామాబాద్ కమీషన రేటు కార్యాలయంలో నిజామాబాద్ అదనపు డి.సి.పి (అడ్మిన్ ) బి. కోటేశ్వర రావు ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి 109వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ ఫోటోకు పూలమాలలు వేసిన అనంతరం అదనపు డి.సి.పి మాట్లాడుతూ సకల జనులు, సబ్బండవర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని జీవితాంతం పోరాడినవ్యక్తి, సాయుధ పోరాట కాలంలో పెత్తందార్లను ఎదిరించిన వారికి న్యాయవాదిగా సేవలందించి, వారి తరపున న్యాయపోరాటం చేసిన ప్రజాస్వామిక వాది అని, గాంధీజి స్ఫూర్తితో దేశ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని, తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటాల్లో అన్ని దశల్లోనూ స్పూర్తిని నిలిపారని, అనగారిన వర్గాల హక్కుల సాధన కోసం సహాకార రంగాల పటిష్టత కోసం జీవితమంతా కృషిచేశారని అన్నారు.ప్రతి ఒక్కరు బంగారు తెలంగాణ కోసం శ్రమించాలని, భవిష్యత్ తరాలకోసం అనునిత్యంప్రతి ఒక్కరు కష్టపడాలని, భావి తరాల కోసం బంగారు బాట వేయాలని పోలీస్ శాఖ సిబ్బందికి అదనపు డి.సి.పి గారు పిలుపునిచ్చారు.ఈ జయంతి సందర్భంగా అదనపు డి.సి.పి ( ఎ.ఆర్ ) శంకర్ నాయక్, ట్రాఫిక్ ఎ.సి.పి నారాయణ, సి.టి.సి ఎ.సి.పి సయ్యద్ మస్తాన్ అలీ, ఆఫీస్ సూపరింటెండెంట్ లు శంకర్, బషీర్, పోలీస్ కార్యాలయం సిబ్బంది సి.సి.ఆర్.బి సిబ్బంది, సి.ఎస్.బి సిబ్బంది, ఐ.టి కోర్ సిబ్బంది, పోలీస్ కంట్రోల్ రూమ్ సిబ్బంది, సెంట్రల్ కాంప్లెంటు సెల్ సిబ్బంది హజరయ్యారు.