*నిథంలో సంబరంగా ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు* *పాల్గొన్న పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు*
హైదరాబాద్ సెప్టెంబర్ 27:(నిఘానేత్రం ప్రతినిధి)ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని గచ్చిబౌలిలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ (నిథం-NITHM) లో నిర్వహించిన వేడుకల్లో పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ఱారావు పాల్గొన్నారు. యువ టూరిజం క్లబ్స్ ద్వారా తెలంగాణ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూ, సంస్కృతి, వారసత్వ పరిరక్షణ, పర్యాటకంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పనలో విశేష కృషి చేసిన మహబూబ్ నగర్, వరంగల్, జగిత్యాల జిల్లాల కలెక్టర్లు, పర్యాటకులకు ఆతిథ్య రంగంలో విశేష సేవలు అందిస్తున్న రెస్ట్రారెంట్, హోటల్ నిర్వాహకులకు మంత్రి అవార్డులను అందజేశారు.
విద్యార్థినిలు, కళాకారులు పరదర్శించిన శివప్రియం, కాకతీయం, కూచిపూడి, పేరిణి నృత్య రూపాలు ,ఆకట్టుకున్నాయి. దేశభక్తి, తెలంగాణ ప్రగతి, పర్యాటక ప్రదేశాలను తెలియజేస్తూ ఆలపించిన ప్రత్యేక గీతాలు, నాటికలు, పాటలకు అనుగుణంగా నృత్యాలు చేశారు. నృత్యాలు చేసిన విద్యార్థులను, కళాకారులను మంత్రి జూపల్లి ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి, పర్యాటక , సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్, పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి, టూరిజం డైరెక్టర్ ఇలా త్రిపాఠి, భాషా, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, బాక్సర్ నిఖత్ జరీనా, షూటర్ ఈషా సింగ్, సింగర్ సాకేత్ , తదితరులు పాల్గొన్నారు.