*నగరపాలక యంత్రంగానికి చూపు మందగించిందా?* *టౌన్ ప్లానింగ్ అధికారులు నిద్ర మత్తులో ఉన్నారా?* *ఇరుకు రోడ్డులో షాపింగ్ మాల్ లకు అనుమతి ఎలా ఇచ్చారు?* *కొనుగోలుదారుల వాహనాలకు పార్కింగ్ స్థలం అవసరం లేదా?* *ఈ అక్రమ నిర్మాణ అనుమతి ఇచ్చిన వారికి ఎవరికి ఎంత ముడుపులు అందాయి?* *ఇంత జరుగుతున్న జిల్లా ముఖ్య అధికారికి కనిపించట్లేదా?* *అక్రమ నిర్మాణ షాపింగ్ మాల్ ఎలా ఓపెన్ అయింది దీని వెనుక ఎవరి అండదండలు ఉన్నాయి?* *టౌన్ ప్లానింగ్ అమలు కాక ఇరుకైన రోడ్డులతో ఇబ్బంది పడుతున్న నగర ప్రజలు* *సెట్ బ్యాక్ స్థలాల్లో నిర్మాణాలు చూసి చూడనట్టు సంబంధిత యంత్రాంగం* *అగ్నిమాపక అధికారులకు ఇప్పుడు గుర్తుకొచ్చిందా ఇన్ని రోజులు లంచాల మత్తులో ఉన్నారా?*
నిజామాబాద్ సెప్టెంబర్ 30:(నిఘానేత్రం ప్రతినిధి) నిజామాబాద్ నగర పాలక సంస్థ అక్రమాలకు నిలయంగా మారిందని గతంలోని నిరూపితమయింది. నగరపాలక సంస్థ లో ప్రతి ఒక్క విభాగం ఆదాయం కలిగిన విభాగాలే ప్రజలకు అతిగా అవసరపడే విభాగాలు నగరపాలక సంస్థలో ఉంటాయి .జీవనమరణ ధ్రువీకర పత్రాల కొరకు కూడా చేతు తడపవలసిందేనని ప్రజల ఆవేదన ఎవరైనా మరణిస్తే వారు మరణించారని వారి దహన సంస్కారాలకు అవసరమైన చిట్టి పొందటానికి కూడా ఆ చిట్టి ఇచ్చే వ్యక్తికి ముడుపులు ఇవ్వనిదే ఆ చిట్టి ఇవ్వడని ప్రజల ఆవేదన. ఎవరైనా పేదవాడు ఇల్లు నిర్మించుకోవాలంటే సవాలక్ష సమస్యలు వాటిని అధిగమించాలంటే. వాటికి సంబంధించిన అనుమతుల కొరకు మున్సిపాలిటీ అనుమతి పొందిన బిల్డింగ్ ప్లానర్ కొందరి వ్యక్తుల ద్వారా వెళ్లి చేతులు తడిపి అనుమతులు పొందవలసిన దుస్థితి ఏర్పడిందని ప్రజల ఆవేదన. పేదవాడికి ఇబ్బంది పెట్టే అధికారాలు ఉన్నవాడిపై చూపడం లేదు ఉన్నవాడికి రెడ్ కార్పొరేట్ ఏసి అనుమతులు ఇచ్చి తప్పుల తడక ఉన్న చూచి చూడనట్టు లంచాల మత్తులో మునిగి తేలుతున్న నగరపాలక సంస్థను ప్రక్షాళన చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నా. జిల్లా ముఖ్య అధికారి కూడా పట్టించుకోవడం లేదని ప్రజల ఆక్రందన. నగరంలో ఎన్నో హోటల్లు ఎన్నో షాపింగ్ మాల్ లు నిర్మాణాలు జరిగినా గతంలోనే జరిగినాయి. సెట్ బ్యాక్ స్థలాల్లో నిర్మాణాలు జరిపి వైన్ షాపులు నిర్వహిస్తున్న నగరపాలక యంత్రంగానికి జిల్లా యంత్రాంగానికి కనిపించట్లేదా కంటి తూర్పు చర్యగా నోటీసులు ఇచ్చి మా పని అయిపోయినట్టు చూయించుకుంటూ ఉన్నవాడికి చుట్టంగా లేని వాడికి యముడిగా ప్రవర్తిస్తున్న నగరపాలక చట్టం అందరికీ సమానంగా ఉండాలని కోరుకుంటున్న ప్రజలు. సెట్ బ్యాక్ స్థలాల్లో నిర్మాణమైన వాటిని వెంటనే తొలగించి సాయి రెడ్డి పెట్రోల్ బంక్ చౌరస్తాలో నిర్మాణమైన షాపింగ్ మాల్ పై చర్య తీసుకొని సమన్యాయాన్ని పాటించాలని ప్రజలు కోరుకుంటున్నారు