Politics

*బి ఆర్ ఎస్ పార్టీ ది తప్పుడు ప్రచారం* *చట్టపరమైన నిబంధనలతోనే హైడ్రా పనిచేస్తుంది* *అక్టోబర్4 వ తేదీన నిజామాబాద్ కు వస్తున్న మహేష్ కుమార్ గౌడ్ కు ఘనస్వాగతం పలకాలి* *మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి*

నిజామాబాద్ , అక్టోబర్ 01(నిఘానేత్రం ప్రతినిధి )

నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రివర్యులు బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రజలకు ఉపయోగపడే ఓక్క పని కూడా చేయని బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పుడు ప్రజల కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీని విమర్శించడం విడ్డూరంగా ఉందని ,బిఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, రుణమాఫీ విషయంలో గానీ హైడ్రా విషయంలో గానీ ప్రజలను తక్కువదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని సుదర్శన్ రెడ్డి అన్నారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి రైతులకు ఒక లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయలేని బిఆర్ఎస్ పార్టీ ఈరోజు ప్రజలకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పై మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీ చేస్తుందని కేవలం బ్యాంకుల్లో వివరాలు తప్పుగా ఉన్న వారికి మాత్రమే కాలేదని బిఆర్ఎస్ తీసుకు వచ్చిన ధరణిలో లోపాల వల్ల కొందరికి రుణమాఫీ కాలేదని వాటన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ పరిష్కరించే విధంగా అన్ని బ్యాంకులకు ఆదేశాలు ఇచ్చిందని ఆయన అన్నారు. టిఆర్ఎస్ ప్రజల కోసం చేసింది ఏమీ లేదని చదువుకునే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ చేయలేదని వారి హయంలో నూతనంగా ఒక మెడికల్ కాలేజీని కూడా నిర్మించలేదని రైతులకు రుణమాఫీ చేయలేదని ఆయన అన్నారు. అదేవిధంగా హైడ్రా విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కానీ హైడ్రా చట్టపరమైన నిబంధనలకు లోబడే పనిచేస్తుందని మూసి పరివాహక ప్రాంతంలోని ఏ ఒక్క పేద ప్రజల ఇంటిపై హైడ్రా ఇప్పటివరకు వెళ్లలేదని కేవలం ప్రభుత్వ స్థలాలు ఆక్రమించిన వారి నుండి ప్రభుత్వ స్థలాలను కాపాడటమే లక్ష్యంగా హైడ్రా పని చేస్తుందని ఆయన అన్నారు. అదేవిధంగా బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని మాట్లాడుతున్నారని కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం గాని ,200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా గాని, 500లకే గ్యాస్ సిలిండర్ గాని, ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు పెంచడం గాని హామీలను నెరవేర్చిందని ,కానీ వారు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా ఇప్పటివరకు చేయని బిజెపి నాయకులు కాంగ్రెస్ పార్టీపై మాట్లాడడం వారి అవివేకానికి నిదర్శనమని ,ఇకపై బీజేపీ నాయకులు మాట్లాడే ముందు వారు ఇచ్చిన హామీలను గుర్తుంచుకొని ప్రజలకు అవి చేసిన తర్వాతే కాంగ్రెస్పై మాట్లాడాలని సుదర్శన్ రెడ్డి బిజెపి నాయకులకు తెలిపారు.అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులుగా నిజామాబాద్ కు చెందిన మహేష్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు ఈ నెల 4 వ తేదీన నిజామాబాద్ కు వస్తున్న సందర్భంగా పాత కలెక్టర్ గ్రౌండ్ లో నిర్వహించే భారీ బహిరంగ సభలో అధిక సంఖ్యలో కార్యకర్తలు ప్రజలు పాల్గొనాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బీన్ హంధాన్, పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, పిసిసి ప్రధాన కార్యదర్శి నగేష్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశ వేణు, బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జ్ సునీల్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్పగంగారెడ్డి, జిల్లా ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు వేణు రాజ్ ,జిల్లా సేవదళ్ అధ్యక్షులు సంతోష్ ,రాంభూపాల్,జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్,పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్,వేణు గోపాల్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button