Politics

*కవిత కాంప్లెక్స్ లో ఉన్న మీసేవ సెంటర్ అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది* *ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు కాకుండా అధిక మొత్తంలో వసూళ్లు* *రిజిస్ట్రేషన్ అధికారులతో అన్నీ ఫైరవీలే* *మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సొసైటీ రిజిస్ట్రేషన్ అన్ని రిజిస్ట్రేషన్లలు ఆ మీసేవ సెంటర్ ముసుగు లోనే* *రిజిస్ట్రేషన్ అధికారులతో కుమ్మక్కై ప్రతిదినము లక్షల్లో ఆదాయం* *మూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తున్న మీసేవ సెంటర్* *చోద్యం చూస్తున్న సంబంధిత అధికారులు* *ఈ అక్రమ దందాలో మీసేవ సెంటర్ పర్యవేక్షణ అధికారులకు కూడా వాటాలు ఉన్నాయా?*

అక్టోబర్ 2:(నిఘానేత్రం ప్రతినిధి) నిజామాబాద్ నగరంలోని కవిత కాంప్లెక్స్ లో ఉన్న మీ సేవా సెంటర్ అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ లో సొసైటీ రిజిస్ట్రేషన్లు ట్రస్ట్ రిజిస్ట్రేషన్లు అన్ని రిజిస్ట్రేషన్లలో వీరి ప్రమేయం లేనిది ఏదీ జరగదు ఎందుకంటే మీ సేవా సెంటర్ కు ప్రతి ఒక్క వ్యక్తి వెళ్లి మా పని చేసి పెట్టమని అడగడంతో దానికి ప్రభుత్వం నిర్ణయించిన రేటు కంటే వంద రెట్లు ఎక్కువ తీసుకొని రసీదు మాత్రం ప్రభుత్వం నిర్ణయించిన రసిదే ఇస్తారు. పేదవారు చట్టంపై అవగాహన లేని వారు తొందరగా పని అయిపోవాలని తొందరపాటులో వచ్చే వారిని టార్గెట్ గా చేసి రిజిస్ట్రేషన్ అధికారులతో కుమ్మక్కై తమ ఇష్టారాజ్యంగా వసూలుకు పాల్పడుతూ ప్రతి దినం లక్షల్లో సంపాదిస్తూ అక్రమాలకు పాల్పడుతున్న ఆ మీ సేవా సెంటర్ పై చర్యలు తీసుకొని ఆ మీ సేవా సెంటర్ అక్కడ నుండి తొలగించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇంత అక్రమాలు ఆ మీ సేవ సెంటర్లో జరుగుతున్న అధికారులకు తెలియట్లేదా. లేదా అధికారుల అండదండలతోనే ఎంత కొనసాగుతున్నాయా అని ప్రజలకు అనుమానాలు ఎన్నో ఉన్నాయి. నిజామాబాద్ లో ఉన్న అన్ని మీసేవ సెంటర్లో అధిక రేటులో వసూలు చేసి ప్రజలను పీడిస్తూ అధిక డబ్బులు వసూలు చేస్తున్నారు. మీ సేవ సెంటర్ల అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది వీటన్నిటిపై చర్య తీసుకొని ప్రజలకు న్యాయం జరిగే విధంగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button