*జిల్లా చుట్టుపక్కల నుండి ప్రజలను తరలించగలిగారు కానీ వారిని కూర్చుండ పెట్టలేకపోయారు* *ఆకలి మంటతో తల్లడిల్లుతూ పట్టణంలోని హోటళ్లకు పరుగు* *ఏరుపాట్లలో విఫలం చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి* *జనాలు లేక ఖాళీ ఖర్చులు దర్శనమిచ్చాయి* *నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా లేదని కేంద్రం నుండి వచ్చిన నాయకురాలు చెప్పింది*
నిజామాబాద్ అక్టోబర్ 3:(నిఘానేత్రం ప్రతినిధి) ఎంతో ఉన్నత పదవి పొంది తన సొంత జిల్లాకు వస్తున్న మహేష్ కుమార్ గౌడ్ కు భారీ స్వాగతం పలకడంలో పట్టణ కాంగ్రెస్ విజయం సాధించింది. ఇంత గొప్ప మహా కార్యక్రమానికి జిల్లా చుట్టుపక్కల గ్రామాల నుండి జనాలను నాయకులు భారీగానే తరలించినప్పటికీ. వారికి సరైన ఏర్పాట్లు చేయక దప్పికతో ఆకలితో తల్లడిల్లి హోటళ్లకు పరిగెత్తారు. ఆ ఓటర్లకు వెళ్లిన అక్కడ కూడా ఫుల్ జనాభా ఉండడం అక్కడ ఆహారం లభించకపోవడం ప్రజలకు ఎంతో ఇబ్బంది కలిగించింది. ప్రజలు ఆవేశంతో జిల్లా అధ్యక్షుడిని దూషిస్తూ సభా ప్రాంగణంలో నుండి తిన్నగా జారిపోయారు. మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడే సమయానికి పాత్రికేయులు ముఖ్య నాయకులు చిన్నపాటి కాంగ్రెస్ కార్యకర్తలు కొందరు మాత్రమే మిగిలి ఉన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దురుసు ప్రవర్తన వల్లనే ప్రజలు వెళ్లినట్టు సమాచారం. నిన్న మధ్యాహ్నం ప్రెస్ మీట్ లో కూడా ప్రెస్ వాళ్లతో దురుసుగా ప్రవర్తించి చీదరించుకొని వెళ్లిపోవడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా లేదని కేంద్రం నుండి వచ్చిన నాయకురాలే చెప్పడం జరిగింది. నిజామాబాద్ జిల్లాను కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం రావాలంటే కార్యకర్తలతో ప్రజలతో మమేకమై అందరిని ఒక తాటిపై తీసుకువెళ్లి ఒక ఉద్యమంలా పనిచేస్తేనే జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని ప్రజల అభిప్రాయం. ఇలాంటి జిల్లా అధ్యక్షుడు ఉంటే కాంగ్రెస్ పార్టీ బలపడదని కొందరు కార్యకర్తలు సభ ప్రాంగణం బయట గుసగుసలాడినట్టు సమాచారం