*తల్లిదండ్రులు చేసిన పుణ్యకార్యలే ఈ స్థాయికి తీసుకువచ్చాయి* *కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే ప్రాణం* *బీసీల కులగణనని రాహుల్ గాంధీ నెత్తిన పెట్టుకున్నారు* *టీ పి సి సి మహేష్ కుమార్ గౌడ్ కు ఘనంగా సన్మానం* *కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం* *కష్టపడ్డ ఫలితానికి నా తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ వడ్డీతో చెల్లించింది*
*
నిజామాబాద్ అక్టోబర్ 4: (నిఘానేత్రం ప్రతినిధి) తల్లిదండ్రులు చేసిన పుణ్యకార్యలే ఈ స్థాయికి తీసుకువచ్చాయని, కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు తప్పక లభిస్తుందని పిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. శుక్రవారం పిసిసి రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారి నిజామాబాద్కు విచ్చేసిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగత ర్యాలీ సన్మాన సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ పొన్న ప్రభాకర్,
దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, గ్రామీణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సమాచార, ప్రచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంత్ రావు, జాతీయ నాయకురాలు, రాష్ట్ర ఇన్చార్జి దీపదాస్ మున్షీ, మాజీ ఎంపీ మధుయాష్ కి గౌడ్,
విచ్చేశారు.
ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ..తమ తల్లిదండ్రులు చేసిన పుణ్యకార్యాలే తనను ఈ స్థాయికి తీసుకొచ్చాయని,
రాజకీయ ప్రయాణంలో తమ తల్లిదండ్రులు నక్సల్ ప్రభావంతో ఎన్నో ఇబ్బందులు పడ్డామని, రాజకీయాల్లో తనకిచ్చినటువంటి పదవి కాపాడుకుంటూ పదవి న్యాయం చేశాను అన్నారు. ఎమ్మెల్యే కావాలని కోరిక ఉండేదని,
ఏదో ఒక పదవి ఇస్తారని నమ్మకంతో కష్టపడి పని చేశానని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి పదవులు తప్పకుండా వస్తాయని చెప్పడానికి నేనే నిదర్శనమని అన్నారు.38 ఏళ్లలో లభలకంటే, నష్టాలు ఎక్కువ చూసానని కానీ భగవంతుడు అన్నీ కలిపి వడ్డీతో సహా ఈరోజు రాష్ట్ర కమిటీ అధ్యక్ష పదవి ఇచ్చాడన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు తన జీవితం ధన్యమైందని అన్నారు.నిజామాబాద్ జిల్లా ఒకప్పుడు ధనగారం ఈరోజు వెనుకబడ్డ ప్రాంతంగా మారిందని దీనికి బిజెపి టీఆర్ఎస్ పార్టీలే కారణమన్నారు. ఈ జిల్లా పీసీసీ అధ్యక్షుడు జిల్లా ప్రత్యేక దృష్టి ఉంచాలని మంత్రులకు ఆయన విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం లోపం లేని జిల్లా నిజామాబాద్ జిల్లా అన్నారు. ఎంపీ గా గంగారెడ్డి, మధు యాష్కీ గౌడ్ ఉన్నప్పుడు పాస్ పార్ట్ కేంద్రం తెచ్చుకున్నామని గుర్తు చేశారు. ఇకపై అదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్ జిల్లా లపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. పీసీసీ రాష్ట్ర కార్యవర్గంలో ఎస్సీ ఎస్టీ లకు ప్రాధాన్యత కల్పిస్తానన్నారు.
నిజం సుగర్ ఫ్యాక్టరీ ఆసియా ఖండంలోని అద్భుతమైన ఫ్యాక్టరీగా ఉండేదని పారిశ్రామికంగా అభివృద్ధి చెందిందుకు పుష్కలంగా పరిశ్రమంలో ఉన్న జిల్లా నిజామాబాద్ అని పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఇకపై నిజామా బాద్ జిల్లా పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానన్నారు.
ఆర్థిక శాఖ మంత్రి తో మాట్లాడి 300 కోట్లు ఇస్తే 21 ప్యాకెజి పూర్తి చేసుకుంటామని మంత్రులను కోరారు.విద్యాపరంగా నిజాంబాద్ జిల్లాల ఒక్క మెడికల్ కళాశాల ఉందని, ప్రభుత్వపరంగా ఇంకొక మెడికల్ కళాశాల రావలసిన అవసరం ఉందన్నారు.
కాంగ్రెస్ పార్టీలో ఎవరి సేవలు పక్కన పెట్టరు ఎవరి సేవలు ఎక్కడ వాడుకోవాలో కాంగ్రెస్ పార్టీకి తెలుసన్నారు. రాజీవ్ గాంధీతో చిన్నప్పుడు ఫోటో దిగానని, కానీ ఆ కుటుంబంతో ఇంతటి అనుబంధం ఏర్పడుతుందని ఊహల్లో కూడా అనుకోలేదు అన్నారు.
గాంధీ కుటుంబం త్యాగాలకు కుటుంబం అని,ఆ కుటుంబంలో మేమంతా సభ్యులం అన్నారు.
2014లో మోడీ ఏ ఏ మాటలు చెప్పి అధికారం లోకి వచ్చారో గుర్తుకు తెచ్చుకోవాలని,
దేవుళ్ళ పేరిట రాజకీయాలు చేస్తున్న పార్టీ బిజెపి పార్టీ అన్నారు.
ఏ రోజు కూడా దేవుడి పేరు చెప్పి ఓట్లు అడగమని, తాము కూడా రాముడి భక్తుల మీనని గుర్తు చేశారు.1983లో ఆవిర్భవించిన బిజెపికి కొన్ని వేల సంవత్సరాల కింద ఉన్న శ్రీరాముడికి ఏం సంబంధం ఏంటని, దేవుడు అందరివాడన్నారు. శ్రీరాముడు పేరు చెప్పి ఓట్లు దండుకొని ఆదాని అంబానీలకే దేశాన్ని దోచిపెట్టడన్నారు.
బీసీల కులగణనని రాహుల్ గాంధీ నెత్తిన పెట్టుకున్నారు.
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి కాంగ్రెస్ పార్టీలో సముచితా స్థానం కల్పిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మండల మోహన్ రెడ్డి.
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ,
మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి,వ్యవసాయ శాఖ సలహాదారుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బీన్ హమ్దాన్,
రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, మినరల్ డెవలప్మెంట్ చైర్మన్ ఇరవత్రి అనిల్, కేశవేణు, రత్నాకర్, మునిపల్లి సాయిరెడ్డి, ఆర్మూర్ ఇన్చార్జి వినయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.