*రాజకీయ నేపద్య కుటుంబం కాకపోయినా ఉన్నత శిఖరానికి చేర్చిన కాంగ్రెస్ పార్టీ* *రాజకీయంగా డి శ్రీనివాస్ తో విభేదాలున్న నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చిన వారు డి శ్రీనివాస్* *ఓపిక సహనం తో పనిచేస్తే కాంగ్రెస్ పార్టీలో అవకాశాలు వస్తాయి అని అనడానికి నేనే ఒక ఉదాహరణ* *ఈ జిల్లాలో పుట్టినందుకు ఈ జిల్లా రుణం తీర్చుకుంటా* *అన్ని వర్గాలను ఒక తాటిపై తీసుకొచ్చి రాష్ట్రంలో 100 సీట్లతో మళ్లీ అధికారంలో రావడానికి పట్టుదలతో కృషి చేస్తా*
నిజామాబాద్ అక్టోబర్ 5:(నిఘానేత్రం ప్రతినిధి) నిన్న జరిగిన సన్మాన మహాసభలో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ. నిజామాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామం నుండి నా ప్రయాణం మొదలుకొని ఉన్నత శిఖరమైన టీ పిసిసి అధ్యక్షునిగా ఎదగడానికి ఎన్నో అవమానాలు ఎన్నో ఒడిదుడుకులు చూసిన వ్యక్తిని ఏనాడు కూడా నిరాశ చెందక ఓపిక సహనంతో కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ముందుకు నడిచాను. సోనియాగాంధీ రాహుల్ గాంధీ మనలను పొంది ప్రతి నాయకుడు మనసులో నాకంటూ ఒక గుర్తింపును ఏర్పరచుకొని ఈ స్థాయికి వచ్చాను. ఇంతవరకు రావడానికి ఎంతో పట్టుదల అవసరం కాంగ్రెస్ పార్టీ అందరికీ అవకాశాలు ఇస్తుంది దాని కొరకు ఓపికతో పనిచేస్తూ ముందుకు సాగాలి. నేను ఇన్ని సంవత్సరాల నుండి నేను కష్టపడి పని చేస్తున్నాను నాకు ఇంతవరకు గుర్తింపు రాలేదని ఏనాడు కృంగిపోకూడదు. నీ సంకల్పం బలమైనది అయితే విజయం నీ వెంటే ఉంటుంది. ఈ జిల్లా వాసిగా ఈ జిల్లాకు ఎంతో చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈ జిల్లాలో ఇంతవరకు ఏవైతే అభివృద్ధి పనులు జరగలేదో వాటిని జరిపించి ఈ జిల్లా ప్రజలకు సుందరవణంగా తీర్చిదిద్ది ప్రజలకు బహుమతిగా ఇస్తాను. నేను మీ వాడిని మీ ఆశీర్వాదంతోనే ఇంతవరకు వచ్చాను మిమ్మల్ని ఏనాడు మరువను మీ ఆశీర్వాదం నాపై ఎల్లప్పుడూ ఉండాలి. రాజకీయంగా డి శ్రీనివాస్ తో విభేదాలు ఉన్న నన్ను రాజకీయాల్లో తీసుకొచ్చింది మాత్రం డి శ్రీనివాస్ గారే. ఇంత స్థాయికి రావడానికి నా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యమే నన్ను ఇంత వాడిని చేసి మీ ముందుంచింది. కచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సువర్ణ అక్షరాలతో మహేష్ కుమార్ గౌడ్ అనే పేరును లిఖించబడే విధంగా పనిచేస్తాను