*కలెక్టరేట్లో ఘనంగా జి.వెంకటస్వామి జయంతి వేడుకలు*
నిజామాబాద్, అక్టోబర్ 05 :(నిఘానేత్రం ప్రతినిధి) కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో జ్యోతి ప్రజ్వలన చేసి అధికారికంగా జయంతి ఉత్సవాలు జరిపారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ సంకేత్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి ముత్తెన్న, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, పర్యవేక్షకుడు పవన్ తదితరులు వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సుదీర్ఘ కాలం పాటు కేంద్ర మంత్రిగా, పార్లమెంటు సభ్యునిగా ప్రాతినిధ్యం వహించిన వెంకటస్వామి దళిత, బడుగు, బలహీన, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేశారని ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు. జయంతి వేడుకల్లో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.